Leading News Portal in Telugu

India vs Pakistan: Key Pitch Details for the Big Match


  • ఆదివారం భారత్-పాకిస్తాన్ మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్
  • దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్
  • పిచ్ ఫాస్ట్ బౌలర్లకు లేదా స్పిన్నర్లకు సహకరిస్తుందా..?.
IND vs PAK: భారత్-పాక్ హైఓల్టేజ్ మ్యాచ్.. పిచ్ రిపోర్ట్ ఇదే..!

2025 ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా.. భారత్-పాకిస్తాన్ మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్ జరుగనుంది. ఫిబ్రవరి 23న (ఆదివారం) దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో తలపడనున్నాయి. కాగా.. టీమిండియా మొదటి మ్యాచ్‌లో గెలిచి ఎంతో ఉత్సాహంతో ఉంది. తర్వాత మ్యాచ్‌లోనూ విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు.. పాకిస్తాన్ జట్టు తొలి మ్యాచ్‌లోనే ఓటమి పాలైంది. టీమిండియా, పాకిస్తాన్ జట్లు సూపర్ సండే మ్యాచ్ కోసం సిద్ధంగా ఉన్నాయి. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లతో పాటు.. అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ రెండు జట్లు ఎనిమిది నెలల తర్వాత తలపడనున్నాయి. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓడిపోయిన తర్వాత డూ ఆర్ డై పరిస్థితిలో ఉన్నందున.. రెండు జట్లకు, ముఖ్యంగా పాకిస్థాన్‌కు ఇది కీలకమైన మ్యాచ్ కానుంది. మరోవైపు, 2017 ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని, సెమీఫైనల్స్ అవకాశాలను మరింత బలోపేతం చేసుకోవాలని భారత్ చూస్తోంది. బంగ్లాదేశ్‌పై తొలి మ్యాచ్ గెలిచిన తర్వాత మెన్ ఇన్ బ్లూ జట్టు బరిలోకి దిగుతోంది మరియు టోర్నమెంట్‌లో తమ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఓడించే ఫేవరెట్‌గా కనిపిస్తోంది. అయితే.. ఈ మ్యాచ్ జరిగే దుబాయ్ స్టేడియం పిచ్ పరిస్థితి ఎలా ఉంటుంది.. పిచ్ ఫాస్ట్ బౌలర్లకు లేదా స్పిన్నర్లకు సహకరిస్తుందా..? అనే విషయాలు తెలుసుకుందాం..

దుబాయ్ పిచ్ పరిస్థితులు:
దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం పిచ్ సాధారణంగా స్లో ట్రాక్‌గా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో బ్యాటింగ్ సులభం కాదు. కొత్త బంతితో ఫాస్ట్ బౌలర్లకు సహాయపడుతుంది. మ్యాచ్ ప్రారంభంలో మహమ్మద్ షమీ మరియు హర్షిత్ రాణా ఈ పిచ్‌ను పూర్తిగా ఉపయోగించుకోవచ్చు. గత మ్యాచ్‌లో షమీ 5 వికెట్లు, రాణా 3 వికెట్లు పడగొట్టారు. మరోవైపు.. టాస్ గెలిచిన జట్టు ఈ గ్రౌండ్ లో లక్ష్యాన్ని ఛేదించడానికి ఇష్టపడుతుంది. ఈ మైదానంలో జరిగిన 59 మ్యాచ్‌లలో, బ్యాటింగ్ చేసిన జట్టు 22 సార్లు గెలిచింది, ఛేజింగ్ జట్టు 35 సందర్భాలలో విజయం సాధించింది.

టాస్ కీలకం:
పాకిస్తాన్ ముందుగా బౌలింగ్ చేస్తే నసీమ్ షా, షాహీన్ షా అఫ్రిది, హరిస్ రౌస్ ఈ పరిస్థితుల నుంచి ప్రయోజనం పొందగలుగుతారు. అలాగే, స్పిన్నర్లకు కూడా కొంత సహకరిస్తుంది. టీమిండియాలో కూల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా ముఖ్యమైన స్పిన్నర్లు ఉండగా.. పాకిస్తాన్‌లో అబ్రార్ అహ్మద్, ఖుష్దిల్ షా ఉన్నారు.

ఆదివారం వాతావరణ అప్‌డేట్:
ఫిబ్రవరి 23న దుబాయ్‌లో వాతావరణం స్పష్టంగా ఉంటుంది. వర్షం పడే అవకాశముండదు.. కాబట్టి అభిమానులు మ్యాచ్‌ను ఎంజాయ్ చేయవచ్చు. గరిష్ట ఉష్ణోగ్రత 32°C, కనిష్ట ఉష్ణోగ్రత 23°C మధ్య ఉంటుంది. తేలికపాటి మేఘాలు, గాలి వేగం 30 km/h ఉండవచ్చు. సాయంత్రం వేళ కొన్ని చోట్ల తేలికపాటి మంచు కురిసే అవకాశం ఉంది.

వన్డేలో పాక్ vs భారత్ హెడ్-టు-హెడ్
వన్డే ఫార్మాట్‌లో పాకిస్తాన్, ఇండియా ఇప్పటివరకు 153 సార్లు తలపడ్డాయి. ఈ 153 వన్డే మ్యాచ్‌లలో పాకిస్తాన్ 73 సార్లు భారత్‌ను ఓడించగా.. భారత్ 57 సార్లు విజయం సాధించింది. ఐదు మ్యాచ్‌లు ఫలితం లేకుండా ముగిశాయి. పాకిస్తాన్, ఇండియా మధ్య మొదటి వన్డే మ్యాచ్ అక్టోబర్ 1, 1978న క్వెట్టాలో జరిగింది. ఇందులో భారత్ నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. ఇరు జట్ల మధ్య జరిగిన వన్డేలో చివరిసారిగా అక్టోబర్ 14, 2023న అహ్మదాబాద్‌లో జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ పాకిస్తాన్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించింది.