Leading News Portal in Telugu

‘Pakistan will win’: Viral IIT Baba makes shocking prediction.


  • సోషల్ మీడియాలో ఐఐటీ బాబా వీడియో వైరల్
    ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ గురించి అంచనా
    భారత జట్టు ఓడిపోతుందన్న ఐఐటీ బాబా.
IND vs PAK: పాకిస్తాన్ గెలుస్తుంది.. ఐఐటీ బాబా జోస్యం

ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా కారణంగా చాలా మంది బాబాలు వెలుగులోకి వచ్చారు. ఇందులో ఐఐటీ బాబా అత్యధిక వార్తల్లో నిలిచాడు. ఐఐటీ ముంబైలో చదువుకున్న అభయ్ సింగ్ సోషల్ మీడియాలో వార్తల్లో నిలిచారు. అతను తన అభిమానులతో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా మాట్లాడుతూ.. వారి ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంటాడు. కాగా.. సోషల్ మీడియాలో ఐఐటీ బాబాకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో అతను ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ గురించి ఒక అంచనా వేశాడు. అతను భారత జట్టు ఓడిపోతుందని అన్నాడు. దీంతో.. టీమిండియా ఫ్యాన్సే కాకుండా.. పాకిస్తాన్ అభిమానులు కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు.

ఐఐటీ బాబా ఆ వీడియోలో మాట్లాడుతూ, “ఈసారి భారత్ గెలవదని నేను మీకు ముందుగానే చెబుతున్నాను. విరాట్ కోహ్లీతో సహా భారత ఆటగాళ్ళు ఫలితాన్ని మార్చలేరు.” అని అన్నాడు. కాగా.. క్రికెట్ ఫ్యాన్స్ అతని వ్యాఖ్యలపై తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఐసీసీ ఈవెంట్లలో ఇప్పటివరకు టీమిండియా పాకిస్తాన్ పై విజయాలు సాధించిన సంగతి తెలిసిందే.. కాగా.. ఈ టోర్నీలో పాకిస్తాన్ తన తొలి మ్యాచ్‌లో ఓటమిని చవిచూసింది. మరోవైపు.. భారత జట్టు బంగ్లాదేశ్‌ను ఓడించింది. ఈ క్రమంలో.. భారత్ జట్టు బలంగా ఉంది.

2025 ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా.. 5వ మ్యాచ్‌లో భారత్, పాకిస్తాన్ తో తలపడుతుంది. ఈ మ్యాచ్ ఫిబ్రవరి 23 ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతుంది. టోర్నమెంట్ నిర్వహణ బాధ్యతను పాకిస్తాన్ కు అప్పగించారు. అయితే.. భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియా పాకిస్తాన్‌కు వెళ్లలేదు. దీంతో.. ఈ ఐసిసి ఈవెంట్ హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహిస్తున్నారు. కాగా.. భారత్‌తో మ్యాచ్ కోసం పాకిస్తాన్ దుబాయ్ వెళ్తుంది.