Leading News Portal in Telugu

Sourav Ganguly Predicts India Will Extend Dominance Over Pakistan in Champions Trophy 2025


  • ఆదివారం భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య హైఓల్టేజ్ మ్యాచ్
  • పాకిస్తాన్‌పై భారత్ అద్భుతమైన రికార్డును కొనసాగిస్తుంది- గంగూలీ
  • పరిమిత ఓవర్లలో భారత్ చాలా బలమైన జట్టు – గంగూలీ.
Sourav Ganguly: పాకిస్తాన్ పై కాదు.. భారత్ ఛాంపియన్ ట్రోఫీనే గెలుస్తుంది

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా.. ఆదివారం భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య హైఓల్టేజ్ మ్యాచ్ జరుగనుంది. ఈ ఆసక్తికర పోరు కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. అటు.. క్రికెట్ అభిమానులతో పాటు, మాజీ క్రికెట్ దిగ్గజాలు, ప్రముఖులు, సెలబ్రిటీలు ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తన అభిప్రాయాన్ని తెలిపారు. ఐసీసీ టోర్నమెంట్లలో పాకిస్తాన్‌పై భారత్ అద్భుతమైన రికార్డును కొనసాగిస్తుందని గంగూలీ ఆశాభావం వ్యక్తం చేశారు. పరిమిత ఓవర్లలో భారత్ చాలా బలమైన జట్టు అని ఆయన చెప్పారు.

భారత్, పాకిస్తాన్‌పై ఆధిపత్యం చూపించడాన్ని గంగూలీ విశ్వసించారు.. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జడేజా వంటి ప్రముఖ ఆటగాళ్లు కీలక పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రపంచ బ్యాట్స్‌మన్‌ల జాబితాలో కోహ్లీ దూసుకుపోతాడని గంగూలీ అన్నారు. మరోవైపు.. వన్డేల్లో రిషబ్ పంత్ Vs కెఎల్ రాహుల్ ఎంపిక విషయాన్ని కూడా వివరించారు. “వన్డేల్లో రాహుల్‌కు మంచి రికార్డు ఉంది.. అందుకే గౌతమ్ గంభీర్ రాహుల్‌కు మద్దతు ఇచ్చారు. అయితే పంత్‌ గొప్ప ఆటగాడు అయినప్పటికీ.. వికెట్ కీపర్-బ్యాటర్‌గా రిషబ్ పంత్ కంటే కేఎల్ రాహుల్‌కు ఆధిక్యం లభించిందని గంగూలీ పేర్కొన్నారు.

అభిషేక్ శర్మ గురించి గంగూలీ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో అభిషేక్ శర్మ బ్యాటింగ్ ఆకట్టుకుందని తెలిపారు. అభిషేక్ శర్మ రికార్డు వన్‌డే క్రికెట్‌లో అందర్నీ ఆశ్చర్యపరిచేలా ఉంది. అతను త్వరలో వన్డే క్రికెట్‌లో అరంగేట్రం చేస్తాడని గంగూలీ ఆశాభావం వ్యక్తం చేశారు.