Leading News Portal in Telugu

Yuvraj Singh, India Vs Pakistan, Yuvraj Singh Quotes, Cricket Rivalry, ICC Champions Trophy, Champions Trophy 2025


  • ఆదివారం పాకిస్తాన్, భారత్ మ్యాచ్
  • ఈ మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్రికెట్ అభిమానులు
  • ఈ మ్యాచ్ గురించి యువరాజ్ సింగ్ ఏమన్నారంటే..?
  • ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడూ ఫైనల్ లాగా అనిపిస్తుంది- యువీ.
Yuvraj Singh: భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడూ ఫైనల్ లాగానే ఉంటుంది..

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా.. ఫిబ్రవరి 23న ఆదివారం దుబాయ్‌లోని దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ హై ఓల్టేజ్ మ్యాచ్‌కు విపరీతమైన క్రేజ్ ఉంది. భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే అన్ని దేశాల క్రికెట్ అభిమానులకు ఎంతో ఆసక్తి.. ఎందుకంటే ఈ రెండు జట్లు అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఒక టీమ్‌తో మరొక టీమ్ ఆడిన మ్యాచ్‌లు తక్కువ. చివరిసారిగా.. జూన్ 2024లో జరిగిన టీ20 ప్రపంచ కప్‌లో భారత్ పాకిస్తాన్‌తో తలపడింది. ఆ మ్యాచ్‌లో భారత్ 6 పరుగుల తేడాతో పాకిస్తాన్‌ను ఓడించింది.

కాగా.. టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ఎన్నో ముఖ్యమైన మ్యాచ్‌లు ఆడాడు. 2007 టీ20 ప్రపంచ కప్ ఫైనల్, 2011 ప్రపంచ కప్ సెమీఫైనల్, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌ల్లో యువరాజ్ ముందుండి నమ్మకంగా ఆడాడు. అయితే.. పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్ గురించి ఆయన మాట్లాడుతూ, “ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడూ ఫైనల్ లాగా అనిపిస్తుంది. అది గ్రూప్ మ్యాచ్ అయినా, సెమీఫైనల్ అయినా, లేదా ఛాంపియన్‌షిప్ మ్యాచ్ అయినా.. అలాగే, ఒత్తిడి చాలా ఎక్కువ ఉంటుంది. ఈ మ్యాచ్ టోర్నమెంట్‌ను సెట్ చేస్తుంది. నేను 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడినప్పుడు మొదటి మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను ఓడించాం, కానీ వారు ఫైనల్‌లో మమ్మల్ని ఓడించారు. కాబట్టి ఏం జరుగుతుందో చెప్పలేము. కానీ ప్రపంచం మొత్తం చూస్తున్న ఒక పెద్ద వేదికపై విజయం సాధించడం చాలా ముఖ్యం.” అని యువరాజ్ సింగ్ తెలిపారు.

2017 ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో యువరాజ్ సింగ్ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన కనబరచారు. 32 బంతుల్లో 8 బౌండరీలు, 1 సిక్సర్‌తో 53 పరుగులు చేసి జట్టుకు మంచి సహాయం అందించారు. కానీ.. వర్షం కారణంగా ఆట నిలిచిపోయింది. ఇండియా 320 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన తర్వాత (డక్‌వర్త్-లూయిస్ పద్ధతి ద్వారా) భారత్ 124 పరుగుల తేడాతో మ్యాచ్‌ను గెలిచారు. యువరాజ్ తన అద్భుతమైన ప్రదర్శనకు “ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్” అవార్డును అందుకున్నారు. కాగా.. ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా పాకిస్తాన్, భారత్ తలపడనుంది.