Leading News Portal in Telugu

Indian national anthem played instead of Australian national anthem in Lahore


  • లాహోర్‌లో ఆస్ట్రేలియా- ఇంగ్లాండ్ మ్యాచ్
  • ఆస్ట్రేలియా జాతీయ గీతానికి బదులుగా
  • భారత జాతీయ గీతాన్ని ప్లే చేసిన వైనం
  • కొన్ని సెకన్లకే ఆపేసిన గ్రౌండ్ మేనేజ్‌మెంట్
Champions Trophy: పాకిస్థాన్‌లో ఆస్ట్రేలియా జాతీయ గీతానికి బదులు..”జనగణమన” ప్లే (వీడియో)

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా నేడు ఆస్ట్రేలియా- ఇంగ్లాండ్ జట్లు తలపడనున్నాయి. రెండు జట్ల మధ్య మ్యాచ్ లాహోర్‌లో జరుగుతోంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు.. ఇరు జట్లు మైదానానికి చేరుకున్నాయి. జాతీయ గీతాలు ప్లే చేయడం మొదలు పెట్టారు. గ్రౌండ్ మేనేజ్‌మెంట్ ఆస్ట్రేలియా జాతీయ గీతానికి బదులుగా భారత జాతీయ గీతాన్ని ప్లే చేసింది. దీంతో అందరూ ఒక్కసారిగా అరవడం ప్రారంభించారు.కొన్ని సెకన్లలోనే భారత జాతీయ గీతాన్ని ఆపి, ఆస్ట్రేలియా జాతీయ గీతాన్ని మళ్ళీ ప్లే చేశారు. ఆస్ట్రేలియా క్రీడాకారులు తమ జాతీయ గీతాన్ని ప్రశాంతంగా పూర్తి చేశారు. ఈ టోర్నీకి పాకిస్థాన్‌ ఆతిథ్య దేశంగా ఉండగా.. భారత్‌ ఆడే మ్యాచ్‌లు దుబాయ్‌ వేదికగా జరగనున్నాయి. కానీ లాహోర్‌లో జాతీయ గీతం ఎందుకు ప్లే చేశారంటూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాకిస్థాన్‌ను విమర్శిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

READ MORE: Prabhas : ప్రభాస్ కోసం రంగంలోకి హాలీవుడ్ యాక్టర్..ఇక మామూలుగా ఉండదు

కాగా.. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. స్టీవ్ స్మిత్ కెప్టెన్సీలో జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఇంగ్లాండ్ తరఫున బరిలోకి దిగిన బెన్‌ డకెట్‌ 95 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. 11 ఫోర్లు, 1 సిక్స్ లతో చెలరేగాడు. బెన్‌ డకెట్‌కు ఇది వన్డేల్లో మూడో సెంచరీ.
ప్రస్తుతం 32 ఓవర్లకు ఇంగ్లాండ్‌ స్కోర్‌ 210/3గా ఉంది.

AUS vs ENG: ఇంగ్లాండ్‌ ఫైనల్‌ XI
ఫిలిప్‌ సాల్ట్, బెన్ డకెట్, జేమీ స్మిత్ (వికెట్ కీపర్), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ (కెప్టెన్), లియామ్‌ లివింగ్‌ స్టోన్, బ్రైడన్ కార్స్‌, జోఫ్రా ఆర్చర్, అదిల్‌ రషీద్, మార్క్‌ వుడ్

AUS vs ENG: ఆస్ట్రేలియా తుది జట్టు
మ్యాథ్యూ షార్ట్, ట్రావిస్ హెడ్, స్టీవ్‌ స్మిత్ (కెప్టెన్), మార్నస్ లబుషేన్, జోష్‌ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), అలెక్స్ కేరీ, గ్లెన్ మాక్స్‌వెల్, బెన్ డ్వారిషూస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, స్పెన్సర్ జాన్సన్