Leading News Portal in Telugu

Shami, who was struggling with his knee, joined the dugout


IND vs PAK: తొలి ఓవర్‌తో షమీ పేరిట చెత్త రికార్డు..

భారత్, పాకిస్తాన్ మధ్య ఆసక్తికర మ్యాచ్ జరుగుతోంది. పాకిస్థాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. పాకిస్థాన్ తరఫున బాబర్ అజామ్, ఇమామ్ ఉల్ హక్ మొదట బ్యాటింగ్ కు దిగారు. తొలి ఓవర్లోనే మహ్మద్ షమీ 5 వైడ్లు వేశాడు. టీం ఇండియా ఇప్పుడు వికెట్ల కోసం చూస్తోంది.

ఈ మ్యాచ్‌లో షమీ పేరిట ఓ చెత్త రికార్డు నమోదైంది. వన్డేల్లో తొలి ఓవర్‌ పూర్తి పూర్తి చేసేందుకు అత్యధిక బాల్స్ వేసిన బౌలర్‌గా షమీ చెత్త రికార్డు సృష్టించాడు. తొలి ఓవర్‌ పూర్తి చేయడానికి 11 బంతులు తీసుకున్నాడు. అంతకుముందు ఇర్ఫాన్‌ పఠాన్‌, జహీర్‌ ఖాన్‌ కూడా 11 బంతులే తీసుకున్నారు. వారితో సమానంగా షమీ నిలిచాడు. కాగా.. ఓవర్‌ వేస్తుండగా మోకాలి విషయంలో ఇబ్బంది పడ్డ షమీ డగౌట్‌కి చేరాడు. వాషింగ్టన్‌ సుందర్‌ సబ్‌స్టిట్యూట్‌గా మైదానంలోకి వచ్చాడు. తొమ్మిదో ఓవర్‌లో భారత్‌కు వికెట్‌ దక్కింది. పాండ్య.. బాబర్‌ను బోల్తా కొట్టించి పెవిలియన్‌కు పంపాడు. పదో ఓవర్‌లో పాకిస్థాన్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. 12 ఓవర్లో షమీ తిరిగి గ్రౌండ్‌లోకి అడుగు పెట్టాడు.. ప్రస్తుతం 11 ఓవర్లకు పాక్‌ స్కోరు: 55-2 గా ఉంది.

భారత ప్లేయింగ్ ఎలెవన్- రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్.

పాకిస్తాన్ ప్లేయింగ్ XI- మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్ వికెట్ కీపర్), ఇమామ్ ఉల్ హక్, బాబర్ అజామ్, కమ్రాన్ గులాం, తయ్యబ్ తాహిర్, సల్మాన్ అఘా, ఖుష్దిల్ షా, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరిస్ రౌఫ్, అబ్రార్ అహ్మద్.