- విరాట్ కోహ్లీపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అధికారులు ప్రశంసల జల్లు
- పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేసిన కోహ్లీ
- మాజీ బీసీసీఐ చైర్మన్, మాజీ క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్,
- బోర్డు వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా, ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమల్ ప్రశంసలు.

విరాట్ కోహ్లీపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అధికారులు ప్రశంసల జల్లు కురిపించారు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీతో చెలరేగాడు. ఈ క్రమంలో మాజీ బీసీసీఐ చైర్మన్, మాజీ క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్, బోర్డు వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా, ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమల్ ప్రశంసించారు. తన ఇన్నింగ్స్‌లో ఒత్తిడి ఉన్న అసాధారణమైన ఓర్పును ప్రదర్శించారని అన్నారు. ఎంత ఒత్తిడి ఉన్నా విరాట్ కోహ్లీలా మరే ఆటగాడు తట్టుకోలేడని బీసీసీఐ అధికారులు తెలిపారు.
బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత ఎంపీ అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ, “విరాట్ కోహ్లీ తన ఇన్నింగ్స్‌లో ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో.. దేశం తరపున ఎలా ఆడాలో చూపించాడు. తన అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఎంతో మంది ప్రజల హృదయాలను గెలుచుకున్నాడు.” అని అన్నారు. బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా మాట్లాడుతూ, “విరాట్ కోహ్లీ సెంచరీ అద్భుతంగా ఉంది. అతను భారత జట్టుకు స్థిరత్వాన్ని ఇచ్చాడు, అతని బ్యాటింగ్ వలన భారత్ విజయాన్ని సాధించింది” అన్నారు. ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమల్ మాట్లాడుతూ, “విరాట్ కోహ్లీ సెంచరీ కోసం దేశం మొత్తం ఎదురుచూసింది. అతని బ్యాటింగ్ విధానం నిజంగా గొప్పది. ఐపీఎల్ భారత క్రికెట్‌కు మేలు చేసిందని నా అభిప్రాయం” అని తెలిపారు.
విరాట్ కోహ్లీ అజేయ సెంచరీతో పాకిస్తాన్ పై 6 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ విజయంతో భారత్ 2025 ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్స్‌కు చేరుకునే అవకాశాన్ని దక్కించుకుంది. కాగా.. వన్డే క్రికెట్‌లో కోహ్లీ 51 సెంచరీలు చేశాడు. కోహ్లీ ఇప్పటికే అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో సెంచరీల ప్రపంచ రికార్డ్ సాధించిన విషయం తెలిసిందే. విరాట్ కోహ్లీ 2023 ప్రపంచ కప్ సెమీఫైనల్ మ్యాచ్‌లో వన్డే అంతర్జాతీయ క్రికెట్‌లో చివరి సెంచరీ సాధించాడు.