- చెన్నై సూపర్ కింగ్స్ అసిస్టెంట్ బౌలింగ్ కోచ్‌గా శ్రీధరన్ శ్రీరామ్
- బ్రావో స్థానంలో శ్రీధరన్ శ్రీరామ్‌కు బాధ్యతలు అప్పగింత
- ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌లకు చాలా సంవత్సరాలు కోచ్‌గా పనిచేసిన శ్రీధరన్.

ఐపీఎల్ 2025 సీజన్ మార్చి 22 నుండి ప్రారంభం కానుంది. కాగా.. ఐపీఎల్ ప్రారంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తమ అసిస్టెంట్ బౌలింగ్ కోచ్‌గా నియమించింది. డ్వేన్ బ్రావో స్థానంలో 49 ఏళ్ల భారత మాజీ ఆల్ రౌండర్ శ్రీధరన్ శ్రీరామ్‌కు బాధ్యతలు అప్పగించారు. కాగా.. ఇంతకుముందు సీఎస్కేకి అసిస్టెంట్ బౌలింగ్ కోచ్‌గా పని చేసిన బ్రావో.. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)కి మెంటర్‌గా చేరారు. శ్రీరామ్ నియామకాన్ని సోమవారం చెన్నై సూపర్ కింగ్స్ తమ అధికారిక ‘X’ ఖాతాలో ప్రకటించింది. CSK పోస్ట్‌లో “మా అసిస్టెంట్ బౌలింగ్ కోచ్ శ్రీరామ్ శ్రీధరన్‌కు సెల్యూట్. చెపాక్ పిచ్ నుండి ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌లకు చాలా సంవత్సరాలు కోచ్‌గా పనిచేసిన శ్రీధరన్.. ఈ కొత్త ప్రయాణాన్ని గర్వంగా ప్రారంభించాడు” అని పేర్కొంది.
శ్రీధరన్ మాజీ ఎడమచేతి స్పిన్ బౌలర్. అతను భారతదేశం తరపున 8 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. అందులో 81 పరుగులు చేసి 9 వికెట్లు పడగొట్టాడు. 2000లో అరంగేట్రం చేసిన శ్రీధరన్.. 2004లో అతని చివరి వన్డే మ్యాచ్ ఆడాడు.
శ్రీధరన్ సీఎస్కేలో స్టీఫెన్ ఫ్లెమింగ్ (ప్రధాన కోచ్), మైక్ హస్సీ (బ్యాటింగ్ కోచ్), ఎరిక్ సైమన్స్ (బౌలింగ్ కన్సల్టెంట్)తో కలిసి పని చేస్తారు. అతను గతంలో 2016-2022 వరకు ఆస్ట్రేలియాలో అసిస్టెంట్ కోచ్‌గా.. తరువాత బంగ్లాదేశ్‌కు టీ20 కన్సల్టెంట్‌గా పనిచేశాడు. వన్డే ప్రపంచ కప్‌కు ముందు అతను టెక్నికల్ కన్సల్టెంట్‌గా కూడా పనిచేశాడు. ఐపీఎల్‌లో శ్రీధరన్ ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లతో అనుభవం ఉంది.
కాగా.. 2024 ఐపీఎల్ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్‌కు చేరుకోలేకపోయింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కంటే ఐదవ స్థానంలో నిలిచింది. కాగా.. 2025 సీజన్‌లో సీఎస్కే తమ తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ (MI)తో తలపడనుంది. చెన్నై స్పిన్ బౌలింగ్ లైనప్‌లో ఆర్. అశ్విన్, రవీంద్ర జడేజా, శ్రేయాస్ గోపాల్, నూర్ అహ్మద్, దీపక్ హుడా, రచిన్ రవీంద్ర ఉన్నారు.