Leading News Portal in Telugu

Big Shock for Pakistan: New Zealand’s Victory Over Bangladesh


  • బంగ్లాదేశ్‌పై న్యూజిలాండ్ విజయం
  • టోర్నీ నుంచి పాక్, బంగ్లాదేశ్‌ ఔట్
  • సెమీస్‌కు భారత్, కివీస్.
NZ vs BAN: బంగ్లాదేశ్‌పై న్యూజిలాండ్ విజయం.. టోర్నీ నుంచి పాక్‌ ఔట్

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా.. 6వ మ్యాచ్ బంగ్లాదేశ్ vs న్యూజిలాండ్ మధ్య జరిగింది. రావల్పిండి క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ విజయం సాధించింది. 237 పరుగుల లక్ష్యాన్ని 23 బంతులు ఉండగానే గెలిచింది. 46.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 240 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో రచిన్ రవీంద్ర (112)సెంచరీతో చెలరేగాడు. 105 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సర్ సాధించాడు. న్యూజిలాండ్ బ్యాటింగ్‌లో టామ్ లాథమ్ (55), డెవిన్ కాన్వే (30), గ్లేన్ ఫిలిప్స్ (21*), మిచెల్ బ్రేస్ వెల్ (11*) పరుగులతో పర్వాలేదనిపించారు. బంగ్లాదేశ్ బౌలింగ్‌లో టస్కిన్ అహ్మద్, నహీద్ రానా, ముస్తఫిజుర్ రహమన్, రిషాద్ హుస్సేన్ తలో వికెట్ తీశారు.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 236 పరుగులు చేసింది. బంగ్లా బ్యాటింగ్‌లో కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటో (77) ఒంటరి పోరాటం చేశాడు. ఆ తర్వాత జాకీర్ అలీ (45) పర్వాలేదనిపించాడు. రిషాద్ హుస్సేన్ (26), తంజీద్ హసన్ (24), మెహిదీ హసన్ మిరాజ్ (13) పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలింగ్‌లో మిచెల్ బ్రేస్ వెల్ అత్యధికంగా 4 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత విల్ ఓ’రూర్కే రెండు వికెట్లు తీశాడు. హెన్రీ, జేమీసన్ తలో వికెట్ సంపాదించారు. కాగా.. ఈ న్యూజిలాండ్ విజయంతో వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచింది. బంగ్లాదేశ్ వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిపోయింది. దీంతో.. పాకిస్తాన్, బంగ్లాదేశ్ టోర్నీ నుంచి నిష్క్రమించగా.. భారత్, న్యూజిలాండ్ సెమీస్‌కు వెళ్లాయి.