Champions Trophy 2025: Pakistani TV Channels Discuss India’s ‘Spellcasting’ Victory, Fans React with Laughter

Champions Trophy 2025 : ‘‘ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ గ్రాండ్ ఫైనల్లో భారత క్రికెట్ జట్టు విజయం సాధిస్తుందని 22 మంది పండితులు అంచనా వేశారు. ఈ 22 మంది పండిట్లను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) నియమించింది. టీమ్ ఇండియా స్టేడియం చేరుకునే ముందు ఏడుగురు పండితులు చేతబడి చేయడం ప్రారంభించారు. దీని తరువాత 22 మంది పండితులు కలిసి 11 మంది పాకిస్తానీ ఆటగాళ్ల దృష్టి మరల్చి భారత జట్టును గెలిపించారు.’’ ఇది నేను చెబుతున్న విషయం కాదు.. పాకిస్తానీ టీవీ ఛానెళ్లలో ఇదే చర్చ నడుస్తోంది.
పాకిస్తానీ వార్తా ఛానెల్ డిస్కవర్ పాకిస్తాన్ టీవీలో ఆరుగురు వ్యక్తుల ప్యానెల్ తమలో తాము మాట్లాడుకుంటున్నట్లు కనిపిస్తుంది. వీడియోలో భారత్ ను గెలిపించడానికి పాకిస్తాన్ జట్టుపై చేతబడి చేయడానికి 22 మంది పండితులను భారతదేశం నియమించుకుందని ఒక ప్యానెలిస్ట్ పేర్కొన్నాడు. భారత జట్టు పాకిస్తాన్ కు రాకపోవడానికి ఇదే కారణమని తెలిపాడు. వాళ్ల పప్పులు ఇక్కడ ఉడకవు కాబట్టే దుబాయ్ లో భారత్ అలా చేస్తుంది.
ఏడుగురు పండితులు ముందుగానే స్టేడియానికి చేరుకుంటారని మరొక వ్యక్తి పేర్కొన్నాడు. వారు మంత్రాలు చదువుతారని పేర్కొన్నారు. మ్యాచ్ ఓడిపోయిన తర్వాత పాకిస్తాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ కూడా స్టేడియంలో కూర్చుని ప్రార్థనలు చేస్తూ కనిపించాడు. ఈ వీడియో వైరల్ అవుతోంది. దీనిలో వహాబ్ రియాజ్, ఆకాష్ చోప్రా, సురేష్ రైనా కూడా దీని గురించి మాట్లాడుకున్నారు.
27 సంవత్సరాల తర్వాత ఐసీసీ టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇస్తున్న పాకిస్తాన్, ఛాంపియన్స్ ట్రోఫీ నుండి నిష్క్రమించిన మొదటి దేశంగా నిలిచింది. మొదట న్యూజిలాండ్ చేతిలో, ఆ తర్వాత భారత జట్టు చేతిలో పాకిస్థాన్ ఓడిపోయింది. ఇప్పుడు పాకిస్తాన్ కు ఒకే ఒక మ్యాచ్ మిగిలి ఉంది. దీనిని ఫిబ్రవరి 27న బంగ్లాదేశ్ లో ఆడతారు. భారత జట్టు చేతిలో ఓటమితో ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ ప్రయాణం ముగిసిపోయింది. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను న్యూజిలాండ్ 60 పరుగుల తేడాతో ఓడించింది. ఈ విజయంతో భారతదేశం నాలుగు పాయింట్లతో గ్రూప్ Aలో అగ్రస్థానానికి చేరుకుంది. సెమీ-ఫైనల్లోకి ఎంట్రీ ఇచ్చింది.
WATCH 😂😭pic.twitter.com/Rq960PO26e
— Times Algebra (@TimesAlgebraIND) February 24, 2025