Leading News Portal in Telugu

Pakistan star set to retire from ODI cricket after Champions Trophy 2025 disaster


  • పాక్ క్రికెట్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్
  • స్టార్ క్రికెటర్ ఫకర్ జమాన్ షాకింగ్ నిర్ణయం
  • వన్డే క్రికెట్ నుంచి రిటైర్ కావాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
Pakistan: పాక్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్..!

పాకిస్తాన్ క్రికెట్ జట్టు ప్రస్తుతం చాలా పరిస్థితిని ఎదుర్కొంటోంది. 29 సంవత్సరాల తర్వాత ఐసిసి ఈవెంట్‌ను నిర్వహిస్తున్న పాకిస్తాన్‌కు ఇబ్బందులు పెరుగుతున్నాయి. మొదటి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయి.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నుండి పాకిస్తాన్ జట్టు నిష్క్రమించింది. ఈ బాధ నుంచి బయటపడక ముందే జట్టుకు మరో పెద్ద దెబ్బ తగిలింది. మీడియా నివేదికల ప్రకారం.. పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ వన్డే క్రికెట్ నుంచి రిటైర్ కావాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

China: మయన్మార్ సరిహద్దుల్లో చైనా రాడార్.. భారత్‌‌కి భద్రతా ముప్పు..

బుధవారం ఓ ఛానెల్‌లో వచ్చిన నివేదిక ప్రకారం.. పాకిస్తాన్ ఓపెనర్ ఫఖర్ జమాన్ తన వన్డే కెరీర్‌ను ముగించాలని యోచిస్తున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా జట్టులోని కొంతమంది సీనియర్ ఆటగాళ్లతో ఆయన దీనిపై చర్చించారని పాకిస్తాన్ మీడియా ఛానల్‌కు సన్నిహిత వర్గాలు చెప్పాయి. “ఛాంపియన్స్ ట్రోఫీ నా చివరి ఐసీసీ టోర్నమెంట్ అవుతుంది. నేను వన్డే క్రికెట్ నుండి విరామం తీసుకోవాలనుకుంటున్నాను” అని జమాన్ చెప్పినట్లు తెలుస్తోంది. ఆరోగ్య సమస్యల కారణంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని నివేదికలు చెబుతున్నాయి. కాగా.. గాయం కారణంగా ఫఖర్ జమాన్ ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమయ్యాడు. అతను దాదాపు మూడు నెలల పాటు క్రికెట్‌కు దూరంగా ఉండనున్నాడు. ఫఖర్ పాకిస్తాన్ తరపున 86 వన్డేలు ఆడి, 46.21 సగటుతో 3651 పరుగులు చేశాడు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను సెంచరీ సాధించాడు.

China: మయన్మార్ సరిహద్దుల్లో చైనా రాడార్.. భారత్‌‌కి భద్రతా ముప్పు..