Leading News Portal in Telugu

NZ vs SA Champions Trophy 2025 Semi-Final New Zealand scored 362 runs Against South Africa, Ravindra and Williamson Shine with Centuries


  • ఛాంపియన్స్ ట్రోఫీ 2025 రెండో సెమి ఫైనల్.
  • లాహోర్ వేదికగా న్యూజిలాండ్, సౌతాఫ్రికా మధ్య సెమీ ఫైనల్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్
  • శతకాలు సాధించిన రచిన్ రవీంద్ర, కేన్ విలయమ్సన్
  • న్యూజిలాండ్ స్కోర్ 362/6.
NZ vs SA Semifinal: రచిన్ రవీంద్ర, విలియమ్సన్ సెంచరీలు.. భారీ స్కోర్ చేసిన న్యూజిలాండ్

NZ vs SA Semifinal: ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఫైనల్ చేరుకున్న విషయం తెలిసిందే. ఇక నేడు లాహోర్ వేదికగా న్యూజిలాండ్, సౌతాఫ్రికా మధ్య రెండో సెమీ ఫైనల్ జరుగుతోంది. ఈ మ్యాచ్లో మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ భారీ స్కోరును సాధించింది. ఓపెనర్ రచిన్ రవీంద్ర, సీనియర్ బ్యాట్స్మెన్ కేన్ విలయమ్సన్ లు సెంచరీలతో చెలరేగడంతో న్యూజిలాండ్ భారీ స్కోరును నమోదు చేసింది.

ఇక నిర్ణిత 50 ఓవర్స్ ముగిసే సమయానికి న్యూజిలాండ్ 6 వికెట్లు కోల్పోయి 362 పరుగులు చేసింది. ఇక న్యూజిలాండ్ ఇన్నింగ్స్ లో రవీంద్ర 108 పరుగులు, కేన్ విలియమ్స్ అన్ని 102 పరుగులు, డేరల్ మిక్చర్ 49 పరుగులు, చివరిలో గెలిన్ ఫిలిప్స్ 49* పరుగుల సునామి ఇన్నింగ్స్ తో భారీ స్కోర్ ను అందుకుంది. ఇక సౌతాఫ్రికా బౌలర్లో ఎంగిడి మూడు వికెట్లు, రబడ రెండు వికెట్లు, మల్డర్ ఒక వికెట్ తీశారు. చూడాలి మరి..సౌతాఫ్రికా భారీ స్కోర్ ను ఛేదించి ఫైనల్ లో అడుగుపెడుతుందో, లేక ఎప్పటి లగే నాకౌట్ మ్యాచ్లలో టోర్నీ నుండి నిష్క్రమిస్తుందో.