Leading News Portal in Telugu

New Zealand Crushes South Africa to Set Up ICC Champions Trophy 2025 Final Clash with India


  • రెండో సెమిస్‌లో భారీ విజయం సాధించిన న్యూజిలాండ్.
  • సౌతాఫ్రికాపై 50 పరుగుల తేడాతో కివీస్ విజయం.
  • ఫైనల్ లో టీమిండియాతో అమీ తుమీ తేల్చుకోనున్న కివీస్.
Champions Trophy Semifinal: సెమిస్‌లో భారీ విజయం సాధించిన న్యూజిలాండ్.. ఫైనల్‌లో భారత్‌తో ఢీ

Champions Trophy Semifinal: చాంపియన్ ట్రోఫీ 2025 లో భాగంగా మంగళవారం రాత్రి జరిగిన మొదటి సెమిస్ మ్యాచ్లో టీం ఇండియా ఆస్ట్రేలియా పైన విజయం సాధించి ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకున్న విషయం తెలిసిందే. ఇక నేడు రెండో సెమీ ఫైనల్ లాహోర్ వేదికగా న్యూజిలాండ్, సౌతాఫ్రికా మధ్య జరగగా సౌతాఫ్రికా పై న్యూజిలాండ్ 50 పరుగుల ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 362 పరుగులు భారీ స్కోరును సాధించింది. ఇప్పటివరకు ఇదే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో ఒక జట్టు చేసిన అత్యధిక స్కోర్.

ఇక న్యూజిలాండ్ ఇన్నింగ్స్ లో ఓపెనర్ రచిన్ రవీంద్ర 108 పరుగులు, సీనియర్ ఆటగాడు కెన్ విలియంసన్ 102 పరుగులతో శతకాలు సాధించడంతో న్యూజిలాండ్ భారీ స్కోర్ సాధించింది. దీనికి తోడుగా డెరియల్ మిచెల్, ఫిలిప్స్ తుఫాను ఇన్నింగ్స్ లు తోడవడంతో న్యూజిలాండ్ భారీ స్కోరును సాధించింది. ఇక దక్షిణాఫ్రికా బౌలింగ్ విషయానికి వస్తే.. ఎంగిడి 3 వికెట్లు, రబడ 2 వికెట్లు వికెట్లు, ముల్డర్ ఒక వికెట్ సాధించారు.

ఇక భారీ స్కోర్ లక్షచేదనకు వచ్చిన దక్షిణాఫ్రికా 20 పరుగుల వద్దనే ఓపెనర్ ను కోల్పోయింది. ఆ తర్వాత ఇన్నింగ్స్ ని చక్కదిద్దే బాధ్యతను కెప్టెన్ బావుమా, వండర్ సన్ తీసుకున్నారు. ఇందులో భాగంగా వీరిద్దరూ రెండో వికెట్ కి 105 పరుగుల కీలక పార్టనర్షిప్ ను అందించారు. బావుమా 56 పరుగులు, వండర్ సన్ 69 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడారు. అయితే, ఈ పరుగులు సౌతాఫ్రికా విజయానికి దోహదం చేయలేకపోయాయి. చివరలో డేవిడ్ మిల్లర్ ధనా ధన్ సెంచరీ ఇన్నింగ్స్ విజయం కోసం పోరాడిన అది కూడా సరిపోలేదు. డేవిడ్ మిల్లర్ కు తన సహచరుల నుంచి సహకారం లేకపోవడంతో దక్షిణాఫ్రికా పరాజయం పాలయ్యింది. నిర్ణిత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 312 పరుగులకే పరిమతమైంది. న్యూజిలాండ్ బౌలింగ్ డిపార్ట్మెంట్ లో కెప్టెన్ మిట్చెల్ స్టాంటర్ 3 వికెట్లు.. ఫిలిప్స్, హేన్రి చెరో రెండు వికెట్లు తీసుకోగా బ్రెస్ట్ వెల్, రవీంద్ర చెరో వికెట్ సాధించారు. ఇక నేడు సెమిస్ లో విజయం సాధించిన న్యూజిలాండ్ జట్టు మార్చి 9న దుబాయ్ వేదికగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ 2025 టైటిల్ కోసం టీమిండియాతో అమీ తుమీ తేల్చుకోనుంది.