Leading News Portal in Telugu

Mohammed Shami is a big criminal.. Muslim organization chief is angry


  • షమీపై ముస్లిం అత్యున్నత సంస్థ చీఫ్ ఆగ్రహం..
  • రంజాన్ సమయంలో ‘‘రోజా’’ పాటించలేదని విమర్శలు..
  • షమీ ఓ నేరస్తుడు అంటూ ఫైర్..
Mohammed Shami: మహ్మద్ షమీ “క్రిమినల్”.. ముస్లిం సంస్థ చీఫ్ ఆగ్రహం.. ఏమైందంటే..

Mohammed Shami: టీం ఇండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీపై ముస్లిం అత్యున్నత సంస్థ నుంచి విమర్శలు వచ్చాయి. ఆల్ ఇండియా ముస్లిం జమాత్ ప్రెసిడెంట్ మౌలానా షాబుద్దీన్ రజ్వీ బరేల్వీ, షమీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. షమీ ఓ క్రిమినల్ అంటూ విమర్శలు చేశారు. క్రికెట్ మ్యాచ్ కారణంగా షమీ రంజాన్ మాసంలో ‘‘రోజా’’ పాటించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. క్రికెట్ మ్యాచ్ సమయంలో షమీ నీరు తాగుతూ, ఇతర కూల్ డ్రింక్స్ తాగుతూ కనిపించాడని షాబుద్దీన్ పేర్కొన్నాడు.

‘‘ఇది ప్రజల్లోకి తప్పుడు సందేశాలను పంపుతుంది. రోజాని పాటించకపోవడం ద్వారా అతను నేరం చేశాడు. అతను అలా చేయకూడదు. షరియత్ దృష్టిలో అతను ఓ నేరస్తుడు. అతడు దేవుడికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది’’ అని ఓ వీడియో మెసేజ్‌లో షాబుద్దీన్ అన్నారు. షమీని విమర్శిస్తూ, రంజాన్ సందర్భంగా రోజా ప్రాముఖ్యతను వివరిస్తూ, ‘‘ఆరోగ్యంగా ఉన్న ఏ పురుషుడు, స్త్రీ అయినా రోజా పాటించకపోతే, పెద్ద నేరస్తులు అవుతారు’’ అని అన్నారు.