Leading News Portal in Telugu

Rohit Sharma Step Down Team India Captain After Champions Trophy 2025


  • ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత టీమిండియా కీలక మార్పులు..
  • భారత జట్టు కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పబోతున్న రోహిత్‌ శర్మ?..
  • ఈ విషయంపై చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌, హెడ్‌కోచ్‌ గంభీర్‌ మధ్య చర్చలు
Rohit Sharma: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత కెప్టెన్సీకి రోహిత్‌ శర్మ గుడ్‌బై..?

Rohit Sharma: ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025లో టీమిండియా వరుస విజయాలతో ఫైనల్‌కు దూసుకుపోయింది. గ్రూప్‌ దశలో టాపర్‌గా నిలవడంతో పాటు సెమీస్‌లో ఆస్ట్రేలియాను చిత్తూగా ఓడించి టైటిల్‌ పోరుకు చేరుకుంది. దుబాయ్‌ వేదికగా ఆదివారం నాడు న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో రోహిత్‌ సేన తలపడబోతుంది. కాగా, ఈ మెగా వన్డే టోర్నమెంట్‌ తర్వాత భారత జట్టులో కీలక మార్పు జరగబోతున్నాయని సమాచారం. రోహిత్‌ శర్మ వన్డే, టెస్టు జట్ల కెప్టెన్సీకి గుడ్ బై పలికి కేవలం ప్లేయర్ గా కొనసాగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ అంశం గురించి ఇప్పటికే చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌, హెడ్‌కోచ్‌ గౌతమ్ గంభీర్‌ మధ్య చర్చలు కూడా కొనసాగినట్లు తెలుస్తుంది.

ఇక, బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీలో ఆస్ట్రేలియా చేతిలో భారత జట్టు ఘోర ఓటమి తర్వాత బోర్డు మీటింగ్ జరిగింది. ఇందులో రోహిత్‌ శర్మ భవిష్యత్తు గురించి సైతం చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, తనలో ఇంకా క్రికెట్‌ ఆడే సత్తా ఉందని రోహిత్‌ నమ్ముతున్నాడు.. కానీ, తన భవిష్యత్‌ కార్యాచరణ ఏమిటన్న అంశం గురించి అతడ్ని టీమిండియా యాజమాన్యం అడిగడంతో పాటు కెప్టెన్సీ విషయంలో మార్పులు చేయాలని చూస్తున్నట్లు మేనేజ్‌మెంట్‌ సూచించింది.. వచ్చే వరల్డ్‌కప్‌ నాటికి జట్టును రెడీ చేసుకోవాలని రోహిత్‌కి కోచ్‌, చీఫ్‌ సెలక్టర్‌ చెప్పారని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. కాగా, విరాట్‌ కోహ్లి గురించి కూడా మేనేజ్‌మెంట్‌ చర్చకు వచ్చింది. దీంతో అతడితో మాట్లాడినట్లు సమాచారం. అయితే, అతడి భవిష్యత్తుకు ఇప్పట్లో ఢోకా లేనట్లే అని పేర్కొన్నాయి.