Leading News Portal in Telugu

Varun Chakravarthy Opens Up on 2021 T20 WC Struggles and Comeback in 2025 Champions Trophy


  • ఫోన్ ద్వారా బెదిరింపులు వచ్చేవి..
  • నన్ను బైక్ మీద వెంబడించారు.
  • ప్రజలకు కనపడకుండా దాక్కునేవాడిని
  • వరుణ్ చక్రవర్తి కామెంట్స్ వైరల్.
Varun Chakravarthy: ఫోన్ ద్వారా బెదిరింపులు వచ్చేవి.. టీమిండియా క్రికెటర్ ఆవేదన

Varun Chakravarthy: భారత క్రికెట్ జట్టు స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుతంగా రాణించి అందరి ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే. ఛాంపియన్స్ ట్రోఫీలో టోర్నమెంట్‌లో అత్యధిక వికెట్లు తీసిన రెండవ బౌలర్‌గా కూడా అతడు నిలిచాడు. అతను కేవలం మూడు మ్యాచ్‌ల్లో తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. అయితే, గత కొన్ని సంవత్సరాలు తనకి చాలా కష్టంగా గడిచాయని, 2021 T20 ప్రపంచ కప్‌లో తన పేలవమైన ప్రదర్శన కారణంగా తనకు ఫోన్‌లో బెదిరింపులు వచ్చేవని వరుణ్ తన పరిస్థితిని గుర్తుచేసుకున్నాడు. తనను భారతదేశానికి తిరిగి రావద్దని హెచ్చరించారని, తన ఇంటి వరకు తనను వెంబడించారని వరుణ్ చెప్పుకొచ్చాడు.

Read also: Trump: ఉక్రేనియన్ సైనికుల ప్రాణాలను కాపాడమని విజ్ఞప్తి చేసిన ట్రంప్.. పుతిన్ ఏమన్నారంటే?

నిజానికి 2021 T20 ప్రపంచ కప్‌లో పేలవమైన ప్రదర్శన తర్వాత వరుణ్ చక్రవర్తిని జాతీయ జట్టు నుండి తొలగించారు. ఆ సమయంలో అతను తన దాదాపు అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ దాదాపు ముగిసినట్లు భావించాడు. తాజాగా ఒక యూట్యూబ్ షోలో ప్రముఖ యాంకర్ గోబీనాథ్‌తో వరుణ్ మాట్లాడుతూ.. 2021 తర్వాత నాకు చాలా చెడ్డ సమయం గడిచిందని, ఆ సమయంలో పూర్తిగా డిప్రెషన్‌లోకి వెళ్లినట్లు తెలిపాడు. ఇక కొద్దీ రోజుల తర్వాత నేను నన్ను చాలా మార్చుకున్నానని ఆయన అన్నారు. నేను నా దినచర్యను మార్చునున్నని, దీనికి ముందు నేను ఒక సెషన్‌లో 50 బంతులు ప్రాక్టీస్ చేసేవాడిని అలాంటిది నేను దాన్ని రెట్టింపు చేసినట్లు తెలిపాడు. సెలెక్టర్లు నన్ను పిలుస్తారో లేదో తెలియకుండానే కఠినంగా శ్రమించానని, అలా మూడవ సంవత్సరం తర్వాత అంతా మారిపోయినట్లు నాకు అనిపించిందని ఆ తర్వాత నేను చాలా సంతోషంగా ఉన్నానని తెలిపాడు.

Read also: Gunfire in America: అమెరికాలో కాల్పులు.. తిరుపతి యువకుడికి తీవ్రగాయాలు

అలాగే వరుణ్ మాట్లాడుతూ, “2021 ప్రపంచ కప్ తర్వాత, నాకు బెదిరింపు కాల్స్ వచ్చాయని, తనని ఇండియాకు రాకండని బెదిరించినట్లు తెలిపారు. ఆ సమయంలో ప్రజలు నా ఇంటికి వచ్చేవారని, వాళ్ళు నన్ను అనుసరించేవారని.. నేను దాక్కోవలసి వచ్చిందని తెలిపాడు. నేను విమానాశ్రయం నుండి తిరిగి వస్తుండగా, కొంతమంది నన్ను బైక్ మీద వెంబడించారని చెప్పుకొచ్చాడు. అభిమానులు భావోద్వేగానికి గురవుతున్నారని నేను అర్థం చేసుకోగలనని అన్నారు. అయితే ఆపత్తి కలం నుండి బయటికి వచ్చి ఇప్పుడు సంతోషంగా ఉన్నట్లు తెలిపాడు.