- మొదలైన ఐపీఎల్ 2025 కౌంట్ డౌన్.
- ప్రతి జట్టులో ఆటగాళ్ల భారీ మార్పులు .
- మరికొన్ని జట్లకు కెప్టెన్స్ కూడా మార్పు.
- మార్చి 22 నుండి ఐపీఎల్ 2025 సీజన్ మొదలు.

IPL 2025 Captains: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ముగిసింది. ఇప్పుడు ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 కోసం కౌంట్‌డౌన్ మొదలైంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా సిద్దమైపోయాయి. ఇక ఐపీఎల్ మెగా వేలం తర్వాత అన్ని టీమ్స్ కొత్తగా కన్పడుతున్నాయి. అంతేకాదు కొన్ని జట్లకు సంబంధించి కెప్టెన్ల జాబితా కూడా మారింది. ఈసారి ఐపీఎల్ 2025లో పాల్గొనే 10 జట్లలో ఏకంగా 9 జట్లకు భారతీయులు కెప్టెన్లుగా వ్యవహరిస్తుండగా.. ఒక్క ఎస్ఆర్హెచ్ జట్టుకు మాత్రం విదేశీ కెప్టెన్ నాయకత్వం వహించనున్నాడు. ఇక ఈ ఐపీఎల్ 2025లో ఆడబోయే 10 జట్లకు సారధ్యం వహించే కెప్టెన్ల వివరాలు ఒకసారి చూద్దాం.
హార్దిక్ పాండ్యా ( ముంబై ఇండియన్స్):
ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్‌గా మరోమారు హార్దిక్ పాండ్యానే కొనసాగనున్నాడు. గత సీజన్‌లో ముంబై ఇండియన్స్ ప్రదర్శన అంతగా ప్రభావవంతంగా లేకపోయినా, ఈసారి మంచి ఫలితాలు తీసుకురావడానికి హార్దిక్ ఎంతమేర కృషి చేస్తాడో చూడాలి మరి.
రుతురాజ్ గైక్వాడ్ (చెన్నై సూపర్ కింగ్స్):
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ బాధ్యతలను కూడా మరోమారు రుతురాజ్ గైక్వాడ్‌కు అప్పగించారు. ఎంఎస్ ధోని కెప్టెన్సీకి వీడ్కోలు చెప్పిన తర్వాత, గత సీజన్‌లో కూడా రుతురాజ్ చెన్నై జట్టును నడిపించాడు. ఇప్పుడు జగబోయే 2025 సీజన్‌లో కూడా అతని నాయకత్వంలో చెన్నై ఎంతమేరకు రాణిస్తుందో చూడాలి.
పాట్ కమిన్స్ (సన్‌రైజర్స్ హైదరాబాద్):
సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టుకు పాట్ కమిన్స్‌ను కెప్టెన్‌గా కొనసాగించింది. గత సీజన్‌లో అతని నాయకత్వంలో హైదరాబాద్ జట్టు ఫైనల్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. కొత్త ఆటగాళ్లతో కమిన్స్ కెప్టెన్సీతో జట్టు మరింత బలంగా కనిపిస్తుంది. చూడాలి మరి గత ఏడాది రికార్డుల పర్వం సృష్టించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ సారి ఎలాంటి ముద్ర వేయనుందో.
అజింక్య రహానే (కోల్‌కతా నైట్ రైడర్స్ ):
కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ఈసారి అజింక్య రహానేను కొత్త కెప్టెన్‌గా నియమించింది. గత సీజన్‌లో కేకేఆర్ ఛాంపియన్‌గా నిలిచినప్పటికీ, అప్పటి కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ పంజాబ్ జట్టుకు మారడంతో, రహానేకి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు.
రజత్ పాటిదార్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు):
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు రజత్ పాటిదార్ కొత్త కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. గత కొన్నేళ్లుగా ఆర్సీబీ తరఫున ఆడిన పాటిదార్, ఈ సారి కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపించనున్నాడు. చూడాలి మరి ఈసారైనా ఆర్సీబీ తలరాత ఎంతమేర మారనుందో.
అక్షర్ పటేల్ ( ఢిల్లీ క్యాపిటల్స్ ):
ఢిల్లీ క్యాపిటల్స్ (DC) తన కొత్త కెప్టెన్‌గా అక్షర్ పటేల్‌ను తాజాగా ప్రకటించింది. అక్షర్ ఆల్‌రౌండర్‌గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇటీవల భారత జట్టు తరఫున అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన అతను, ఈసారి ఢిల్లీ జట్టును విజయవంతంగా నడిపించే బాధ్యతను మోయనున్నాడు.
శ్రేయాస్ అయ్యర్ (పంజాబ్ కింగ్స్):
పంజాబ్ కింగ్స్ జట్టుకు శ్రేయాస్ అయ్యర్ కొత్త కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. ఐపీఎల్ మెగా వేలంలో భారీ ధరకు కొనుగోలు చేసిన పంజాబ్ కింగ్స్, అతన్ని కెప్టెన్‌గా ముందుగానే ప్రకటించింది. గతంలో కేకేఆర్ జట్టుకు టైటిల్ అందించిన అనుభవం ఉన్నందున, అతని నాయకత్వంలో పంజాబ్ ఈసారి మెరుగైన ప్రదర్శన చేయాలని భావిస్తోంది.
సంజూ సామ్సన్ (రాజస్థాన్ రాయల్స్):
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా సంజూ సామ్సన్ కొనసాగనున్నాడు. గత కొన్నేళ్లుగా రాజస్థాన్ జట్టును నడిపించిన అతను, 2025 సీజన్‌లో కూడా అదే విధంగా జట్టును ముందుకు తీసుకెళ్లనున్నాడు.
రిషబ్ పంత్ ( లక్నో సూపర్ జెయింట్స్):
లక్నో సూపర్ జెయింట్స్ (LSG) రిషబ్ పంత్‌ను కెప్టెన్‌గా నియమించింది. ఐపీఎల్ 2025 వేలంలో రిషబ్ పంత్‌ను 27 కోట్లకు కొనుగోలు చేసిన లక్నో టీమ్, అతనిపై భారీగా నమ్మకం పెట్టుకుంది. ఈ వేలం ద్వారా పంత్ ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు.
శుభ్‌మన్ గిల్ (గుజరాత్ టైటాన్స్):
గుజరాత్ టైటాన్స్ జట్టుకు శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. హార్దిక్ పాండ్యా గత సీజన్‌లో ముంబైకి మారిన తర్వాత గిల్ జట్టును నడిపిస్తున్నాడు. 2025 సీజన్‌లో అతని నాయకత్వంలో గుజరాత్ టైటాన్స్ మరింత మెరుగైన ప్రదర్శన చేసే అవకాశం ఉంది.
మొత్తానికి ఐపీఎల్ 2025 సీజన్ కోసం అన్ని జట్లు తమ సన్నద్ధతను పూర్తి చేసుకున్నాయి. కొత్త కెప్టెన్లు, కొత్త ఆటగాళ్లతో ఈ సీజన్ మరింత రసవత్తరంగా మారనుంది. ఏ కెప్టెన్ తన జట్టును విజయానికి నడిపిస్తాడో, ఏ జట్టు టైటిల్‌ను గెలుచుకుంటుందో మరికొన్ని రోజులు
వేచి చూడాలి.