- ఐపీఎల్ టికెట్ల జారీ ప్రారంభం
- ఆన్లైన్ లో బుక్ చేసుకున్న వారికి ఫిజికల్ టికెట్స్ జారీ
- ఉప్పల్ వేదికగా 23, 27 తేదీల్లో జరిగే ఐపీఎల్ మ్యాచ్ ఫిజికల్ టికెట్స్ అందుబాటులోకి

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2025 బజ్ ప్రారంభమైంది. మార్చి 22 నుంచి ఐపీఎల్ మ్యాచ్ లు ప్రారంభంకానున్నాయి. తొలి మ్యాచ్ మార్చి 22న డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్రైడర్స్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఈడెన్ గార్డెన్స్ వేదికగా ప్రారంభం కానుంది. మార్చి 23వ తేదీన ఉప్పల్ వేదికగా హైదరాబాద్ – రాజస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. కాగా ఈనెల ఉప్పల్ వేదికగా 23, 27 తేదీల్లో జరిగే ఐపీఎల్ మ్యాచ్ ఫిజికల్ టికెట్స్ అందుబాటులోకి వచ్చాయి.
ఐపీఎల్ టికెట్స్ జారీ ప్రారంభమైంది. ఆన్లైన్ లో ఐపీఎల్ టికెట్లు బుక్ చేసుకున్న వారికి ప్రత్యేక కౌంటర్ల ద్వారా ఫిజికల్ టికెట్స్ జారీ చేయనున్నారు. సికింద్రాబాద్ జింఖానా స్టేడియం, ecil స్టేడియం, గచ్చిబౌలి స్టేడియంతోపాటు.. హిమాయత్ నగర్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఫిలింనగర్, జూబ్లీహిల్స్, కొండాపూర్, అత్తాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని కాలిఫోర్నియా బురిటో రెస్టారెంట్ల లో ఫిజికల్ టికెట్లు అందించనున్నారు. ఆన్లైన్ లో టికెట్ బుక్ చేసుకున్న వారు QR కోడ్, ఆధార్ చూపిస్తే టికెట్స్ అందించనున్నారు నిర్వాహకులు.