- క్రికెట్ అభిమానులకు శుభవార్త..
- 90 రోజులు ఉచితంగా జియో హాట్‌స్టార్ యాక్సెస్
- మొబైల్ లేదా టీవీ ద్వారా 4K క్వాలిటీలో మ్యాచ్‌లను చూడొచ్చు.
IPL 2025 JioHotstar: క్రికెట్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న IPL 2025 మార్చి 22న ప్రారంభంకానుంది. తొలి మ్యాచ్‌లో గత విజేత కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్లు తలపడబోతున్నాయి. గత కొద్దికాలంగా టెలికాం సేవలను అందిస్తున్న జియో (Jio) సంస్థ మరోసారి వినియోగదారులకు విశేష ప్రయోజనాలను అందించేందుకు ముందుకొచ్చింది. ప్రత్యేకించి క్రికెట్ అభిమానుల కోసం, 2025 క్రికెట్ సీజన్‌ను మరింత రసవత్తరంగా మార్చేందుకు జియో ఒక అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటించింది. ఎప్పుడూ వినియోగదారులకు ఉత్తమ సేవలను అందించేందుకు ప్రయత్నించే జియో, ఈసారి తన వినియోగదారులకు ఉచితంగా జియోహాట్‌స్టార్ సేవలను అందించే ఆఫర్‌ను తీసుకొచ్చింది.
జియో సిమ్ వినియోగదారులు కేవలం రూ.299 లేదా అంతకంటే ఎక్కువ విలువైన ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే.. 90 రోజులు ఉచితంగా జియో హాట్‌స్టార్ యాక్సెస్, అలాగే 50 రోజుల పాటు ఉచితంగా జియోఫైబర్ లేదా జియోఎయిర్‌ఫైబర్ ట్రయల్ పొందే అవకాశం అందుకుంటారు. ఈ ఆఫర్ ద్వారా క్రికెట్ ప్రేమికులు తమ మొబైల్ లేదా టీవీ ద్వారా 4K క్వాలిటీలో మ్యాచ్‌లను చూడొచ్చు.
ఈ ఆఫర్‌ను పొందడానికి వినియోగదారులు మార్చి 17 నుంచి 2025 మార్చి 31 వరకు రీఛార్జ్ చేసుకోవాలి లేదా కొత్త జియో సిమ్ తీసుకోవాలి. ఒకవేళ ఇప్పటికే జియో సిమ్ ఉన్న వినియోగదారులు రూ.299 (రోజుకి 1.5GB లేదా అంతకంటే ఎక్కువ డేటా) లేదా అంతకంటే ఎక్కువ విలువైన ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకోవాలి. కొత్తగా జియో సిమ్ తీసుకునే వారు రూ.299 లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్‌తో యాక్టివేట్ చేసుకోవాలి. మార్చి 17 కంటే ముందే రీఛార్జ్ చేసిన వినియోగదారులు ఈ ఆఫర్‌ను పొందేందుకు రూ.100 యాడ్-ఆన్ ప్యాక్ వాడుకోవాలి.
ఇక ఈ ఆఫర్ లో భాగంగా జియోహాట్‌స్టార్ ఉచిత సబ్‌స్క్రిప్షన్ మార్చి 22న ప్రారంభమవుతుంది. ఇది మొత్తం 90 రోజుల వరకు అమల్లో ఉంటుంది. మరిన్ని వివరాల కోసం 6000860008 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వాలి. మొత్తంగా క్రికెట్ మ్యాచ్‌లు చూడటానికి సపరేట్‌గా ఓటీటీ ప్లాన్ కొనడం అనవసరమని భావించే వారికి జియో ఈ ఆఫర్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. అయితే ఈ ఆఫర్ కేవలం మార్చి 17 నుంచి మార్చి 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కాబట్టి, త్వరపడటం మంచిది. మరిన్ని వివరాల కోసం Jio.com వెబ్‌సైట్ లేదా దగ్గరలోని జియో స్టోర్‌ను సందర్శించవచ్చు.