Leading News Portal in Telugu

“Virat Kohli Told Me Not to Use ‘Ee Saala Cup Namde’ Anymore,” Reveals AB de Villiers


  • “ఈ సాలా కప్ నమ్దే” నినాదం గురించి డివిలియర్స్ ఆసక్తికర విషయం వెల్లడి
  • కోహ్లీ తనకు “ఈ సాలా కప్ నమ్దే” అనే పదాన్ని ఉపయోగించవద్దని కోరారు- ఏబీ
  • 2011 నుంచి 2021 వరకు ఆర్సీబీ తరపున ఆడిన ఏబీ డివిలియర్స్.
AB de Villiers: “ఈ సాలా కప్ నమ్దే” అని అనొద్దన్నాడు..

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మాజీ బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్ క్రికెట్ అభిమానులకు ఎంతో సుపరిచితం.. అతను ఐపీఎల్‌లో ఆర్సీబీ తరుఫున ఆడాడు. అయితే.. ఐపీఎల్ ప్రారంభమయ్యే ప్రతీసారి ఆర్సీబీ ఫ్యాన్స్.. “ఈ సాలా కప్ నమ్దే” అని అంటుంటారు. ఐతే ఆర్సీబీ జట్టు మాత్రం అభిమానుల కల నెరవేర్చకుండానే నిరాశపరుస్తుంది. అయితే.. ఆర్సీబీ ఫ్యాన్స్ చెప్పే “ఈ సాలా కప్ నమ్దే” నినాదం గురించి డివిలియర్స్ ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు.

ఏబీ డివిలియర్స్ 2011 నుంచి 2021 వరకు ఆర్సీబీ తరపున 11 సీజన్లలో ఆడాడు. అయితే ఇటీవల విరాట్ కోహ్లీ నుండి ఒక ప్రత్యేక సందేశం అందుకున్నట్లు డివిలియర్స్ చెప్పారు. కోహ్లీ తనకు “ఈ సాలా కప్ నమ్దే” అనే పదాన్ని ఉపయోగించవద్దని కోరినట్లు ఏబీ డివిలియర్స్ వెల్లడించారు. “నేను ఎక్కడో ‘ఈ సాలా కప్ నమ్దే’ అన్నాను, వెంటనే విరాట్ నుండి ఆ పదాన్ని ఇకపై ఉపయోగించవద్దని సందేశం వచ్చింది. ఈ సీజన్‌లో ఆర్సీబీ ట్రోఫీని కొట్టగలిగితే.. నేను కూడా వారితో సంబరాలు జరుపుకోవడానికి వస్తాను” అని ఏబీ డివిలియర్స్ తన అనుభవాన్ని ప్రముఖ టీవీ షోలో వివరించారు.

కాగా.. ఆర్సీబీ ఇప్పటికీ తమ తొలి ఐపీఎల్ టైటిల్ కోసం ఎదురుచూస్తోంది. కాగా.. ఈసారైనా కప్ కొట్టాలనే ఆశతో ఆర్సీబీ రంగంలోకి దిగుతుంది. తన అభిమాన జట్టు ఆర్సీబీ విజయాన్ని చూసేందుకు తనకు ఎంతో ఆసక్తి ఉందని డివిలియర్స్ వెల్లడించారు. అయితే.. డివిలియర్స్ మాటలు ఆర్సీబీ ఫ్యాన్స్‌కు ఉత్సాహాన్ని నింపాయి. కాగా.. ఆర్సీబీ మొదటి మ్యాచ్ కేకేఆర్‌తో ఆడనుంది.