Leading News Portal in Telugu

BCCI Announces Umpire Panel for IPL 2025, Seven New Indian Umpires Included.


  • ఐపీఎల్ 2025 కోసం అంపైర్ల జాబితా ప్రకటన
  • ఈసారి ఐపీఎల్‌లో ఏడుగురు కొత్త భారతీయ అంపైర్లు
  • తొలిసారి అధికారికంగా అంపైరింగ్ బాధ్యతలు.
IPL 2025: ఈ సీజన్ ఐపీఎల్ అంపైర్లు వీరే.. ఏడుగురు కొత్తవారికి ఛాన్స్

భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఐపీఎల్ 2025 కోసం అంపైర్ల జాబితాను ప్రకటించింది. ఈసారి ఐపీఎల్‌లో ఏడుగురు కొత్త భారతీయ అంపైర్లు తొలిసారి అధికారికంగా అంపైరింగ్ బాధ్యతలను చేపట్టనున్నారు. మరోవైపు.. సీనియర్ అంపైర్లు కుమార్ ధర్మసేన, అనిల్ చౌదరి ఈ సీజన్‌లో కనిపించరు. అనిల్ చౌదరి అంపైరింగ్‌కు వీడ్కోలు పలికి వ్యాఖ్యాతగా మారనున్నారు. అయితే.. ధర్మసేన ఈసారి ఎందుకు లేరు అనే విషయం పై స్పష్టమైన సమాచారం ఇంకా వెల్లడికాలేదు. ఈ ఇద్దరి స్థానాలను భర్తీ చేసేందుకు మైఖేల్ గోఫ్, క్రిస్ గాఫ్నీ, అడ్రియన్ హోల్డ్‌స్టాక్ వంటి అంతర్జాతీయ అంపైర్లు బాధ్యతలు తీసుకోనున్నారు.

కొత్తగా ఎంపికైన ఏడుగురు భారతీయ అంపైర్లు:
బీసీసీఐ ఈసారి కొత్తగా ఏడుగురు భారతీయ అంపైర్లను ఎంపిక చేసింది. వీరిలో…
స్వరూప్‌నంద్ కన్నూర్
అభిజిత్ భట్టాచార్య
పరాశర్ జోషి
అనిష్ సహస్రబుద్ధే
కేయూర్ కేల్కర్
కౌశిక్ గాంధీ
అభిజీత్ బెంగర్
ఈ కొత్త అంపైర్లందరూ అనుభవజ్ఞులైన ఎస్. రవి, సికె నందన్ మార్గదర్శకత్వంలో శిక్షణ పొందారు. మరోవైపు.. UPCA ఇటీవల తన్మయ్ శ్రీవాస్తవ ఐపీఎల్‌లో అంపైర్‌గా అరంగేట్రం చేయనున్నట్లు ప్రకటించింది.

అనిల్ చౌదరి- 17 సీజన్ల అంపైరింగ్‌కు వీడ్కోలు:
అనిల్ చౌదరి 2008 నుండి 2024 వరకు 17 సీజన్ల పాటు ఐపీఎల్‌లో అంపైరింగ్ చేశారు. 60 ఏళ్ల అనిల్ చౌదరి ఈసారి కొత్త పాత్రలో టీవీ వ్యాఖ్యాతగా మారనున్నారు. ఈ నిర్ణయం వల్ల అంపైర్‌గా ఆయన పూర్తిగా రిటైర్ అయ్యారా? అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.