Leading News Portal in Telugu

vipraj nigam Shines in IPL 2025 with Stunning Debut Performance for Delhi Capitals.


  • అరంగేట్రం మ్యాచ్‌లోనే అదరగొట్టిన విప్రజ్ నిగమ్
  • అద్భుత ప్రదర్శన కనబరిచిన యువ ఆటగాడు
  • తొలి మ్యాచ్‌లో ఆల్-రౌండ్ ప్రదర్శన.
Delhi Capitals: అరంగేట్రం అంటే ఇలా ఉండాలి.. తొలి మ్యాచ్‌లోనే

విప్రజ్ నిగమ్… నిన్నటి వరకు చాలా తక్కువ మందికి ఈ పేరు తెలుసు. అయితే.. 2025 సీజన్ ప్రారంభంలో ఈ యువ ఆటగాడు తన అద్భుతమైన ప్రదర్శనతో ప్రతి క్రికెట్ ప్రేమికుడి నోట ఇతని పేరే మెదులుతుంది. లక్నో సూపర్ జెయింట్స్ (LSG)తో జరిగిన మ్యాచ్‌లో విప్రజ్ నిగమ్ తన తొలి మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన ప్రదర్శించి తన ప్రతిభను చాటాడు. విప్రజ్ తన తొలి మ్యాచ్‌లో ఆల్-రౌండ్ ప్రదర్శనతో మెప్పించాడు. మొదట.. లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్ ఐడెన్ మార్క్రమ్‌ను అవుట్ చేసి ముఖ్యమైన వికెట్ సాధించాడు. నికోలస్ పూరన్‌ను కూడా అవుట్ చేసే అవకాశం వచ్చినప్పటికీ.. పాయింట్ వద్ద సమీర్ రిజ్వి క్యాచ్ వదిలి పెట్టాడు. అటు బౌలింగ్‌లోనూ.. బ్యాటింగ్‌లోనూ విప్రజ్ తన సత్త చూపించాడు. 15 బంతుల్లో 39 పరుగులతో అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు.

KL Rahul: కేఎల్ రాహుల్‌కు ప్రత్యేక విషెష్ చెప్పిన ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్.. వీడియో వైరల్!

ఈ మ్యాచ్‌లో ట్రిస్టన్ స్టబ్స్ ఔటై ఢిల్లీ ఆశలు ఆవిరవుతున్న క్రమంలో.. విప్రజ్ నిగమ్ క్రీజులోకి వచ్చాడు. 13వ ఓవర్‌లో బ్యాటింగ్‌కు దిగిన విప్రజ్.. మొదట నెమ్మదిగా ఆడాడు. ఆ తర్వాత 14వ ఓవర్‌లో గేర్ మార్చాడు. రవి బిష్ణోయ్ వేసిన ఓవర్‌లో రెండు ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు. ఆ తర్వాత.. షాబాజ్ నదీమ్ వేసిన ఓవర్‌లో కూడా విప్రజ్ బౌండరీలు, సిక్సర్ బాదాడు. విప్రోజ్ 15 బంతుల్లో 39 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తన అద్భుత బ్యాటింగ్ ప్రదర్శనతో జట్టు విజయాన్ని సాధించడంలో సహాయపడింది.

Health Tips: ఉక్కు లాంటి కండరాల కోసం ఈ కూరగాయలు బెస్ట్.. గుడ్లలో కంటే ఎక్కువ ప్రోటీన్!

విప్రజ్ నిగమ్ ఎవరు..?
విప్రజ్ నిగమ్ 20 సంవత్సరాల యువ ఆటగాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అతను ఒక లెగ్ స్పిన్ ఆల్-రౌండర్. అతనిని 2025 ఐపీఎల్ మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ రూ.50 లక్షలకు కొనుగోలు చేసింది. యూపీ టీ-20 లీగ్‌లో తన అద్భుత ప్రదర్శనతో పాపులర్ అయిన విప్రజ్.. 2024-25 సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో 8 వికెట్లు తీసి వెలుగులోకి వచ్చాడు. గతంలో కూడా విప్రజ్ అద్భుత ప్రదర్శన ఇచ్చాడు. ఆంధ్రప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో విప్రజ్ 8 బంతుల్లో 27 పరుగులు చేసి తన ప్రతిభను చాటాడు. రింకు సింగ్‌తో కలిసి బ్యాటింగ్ చేసిన ఈ జంట.. ఉత్తరప్రదేశ్‌కు విజయాన్ని అందించింది. అలాగే.. సీజన్ ప్రారంభం ముందు ఢిల్లీ ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్‌లో 29 బంతుల్లో 54 పరుగులు చేసి అందరినీ అబ్బురపరిచాడు.