వెస్టిండీస్ ఘన విజయం
పోర్ట్ ఆప్ స్పెయిన్: శ్రీలంకతో ఇక్కడ జరిగిన తొలి టెస్ట్‌లో వెస్టిండీస్ 226 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 453 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ చేపట్టిన శ్రీలంక..ఆదివారం చివరి రోజు 226 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ కుశాల్ మెండిస్ (102) సెంచరీతో లంక ఓటమిని కొద్దిసేపు నిలువరించాడు. మిగిలిన వారిలో మాథ్యూస్ (31), కెప్టెన్ చాందిమల్ (27) తప్ప అంతా ఘోరంగా విఫలమయ్యారు.
సంక్షిప్తస్కోర్లు : వెస్టిండీస్ 414/8 డిక్లేర్డ్, 223/7 డిక్లేర్డ్
శ్రీలంక : 185, 226