Leading News Portal in Telugu

అతడిని చూస్తే ఇంజమామ్ గుర్తొచ్చాడు.. రోహిత్‌పై యూవీ వ్యాఖ్యలు

టీమ్ఇండియాలోకి వచ్చిన కొత్తలో రోహిత్ శర్మను చూస్తే పాకిస్థాన్ క్రికెటర్ ఇంజమామ్ ఉల్ హక్‌లా అన్పించిందని మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ అభిప్రాయపడ్డాడు. రోహిత్ బ్యాటింగ్ తీరుతో పాటు బౌలర్లను ఎదుర్కొనే సమయంలో ఇంజమామ్ స్టైల్‌లో బ్యాటింగ్ చేస్తాడని తెలిపారు. యూట్యూబ్ చాట్‌లో రోహిత్ శర్మపై యువరాజ్ సింగ్‌ను అభిమానులు మొదట చూడగానే ఏలాంటి అభిప్రాయం ఏర్పడిందని అడిగిన ప్రశ్నకు యూవీ ఇలా బదులిచ్చాడు. వాస్తవానికి రోహిత్ శర్మ జట్టులోకి వచ్చిన సమయంలోనే అతడికి ఉత్తమ భవిష్యత్తు ఉంటుందని అన్పించిందని చెప్పుకొచ్చాడు. ఇదిలావుంటే.. రోహిత్ శర్మ టీమిండియా తరపున 32 టెస్ట్ మ్యాచ్‌లు, 224 వన్డేలు, 108 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 2007 సంవత్సరంలోనే తొలి వన్డే, టీ20 ఆడినప్పటికీ సుదీర్థ ఫార్మాట్‌లో ఆడేందుకు 6 సంవత్సరాల తర్వాత అవకాశం దక్కింది. వెస్టిండీస్‌తో నవంబర్ 2013లో తొలి టెస్టు మ్యాచ్ ఆడాడు.