ఆడవాళ్లకు టీవీలకు మంచి అనుబంధం ఉందన్న విషయం తెలిసిందే.. ఎప్పుడు ఇల్లు, బాధ్యతతో విసిగిపోయిన వారికి టీవీ కాస్త రిలాక్స్ ను ఇస్తుంది.. అయితే మన టీవీని ఎక్కడికైనా తీసుకెళ్లలేము.. కొన్నిసార్లు ఈ విషయం పై నిరాశ చెందుతారు.. దీనికి బదులుగా ల్యాప్‌టాప్స్, ట్యాబ్లెట్స్‌తో చాలా మంది సరిపెట్టుకుంటారు. అయినా వారిలో వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు టీవీ తీసుకెళ్లలేకపోతున్నామనే డిసప్పాయింట్‌మెంట్ కలుగుతుంది. అలాంటి వారికి ప్రముఖ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ తయారీదారు ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఒక గుడ్ న్యూస్ చెప్పింది.
తాజాగా ఈ కంపెనీ ఒక టీవీని తీసుకొచ్చింది.. స్టాండ్‌బైమీ గో పేరుతో కొత్త పోర్టబుల్ టచ్‌స్క్రీన్ టీవీని లాంచ్ చేసింది. ఇది ఒక ట్రావెలింగ్ సూట్‌కేస్‌తో వస్తుంది. ఈ సూట్‌కేస్ ఓపెన్ చేస్తే టీవీ స్క్రీన్, స్పీకర్స్, పవర్ సప్లై వంటివి కనిపిస్తాయి. ఈ బ్రీఫ్‌కేస్‌ను ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. దాన్ని ఓపెన్ చేసి 27-అంగుళాల సైజు ఉండే టీవీ స్క్రీన్‌పై వీడియో కంటెంట్ చూసి ఆస్వాదించొచ్చు.. ఇప్పటివరకు ఎటువంటి టీవిలకు ఇలాంటి ఫీచర్స్ లేవు.. దాంతో మార్కెట్ ఈ టీవీ కి డిమాండ్ పెరుగుతుంది.. స్వివెల్ డిజైన్‌తో వచ్చే స్టాండ్‌బైమీ గో టీవీ స్క్రీన్‌ను 360 డిగ్రీలు తిప్పవచ్చు. దీంట్లోని 20W స్పీకర్స్‌తో అద్భుతమైన ఆడియో ఎక్స్‌పీరియన్స్ ఆస్వాదిస్తూ సినిమాలు చూడవచ్చు. చెస్ వంటి ఆటలు ఆడుకోవచ్చు. లేదా ప్రయాణంలో వర్క్ చేయడానికి ఉపయోగించవచ్చు…
ఫీచర్స్ ను చూస్తే..ఈ టీవీలోని ఇన్-బిల్ట్ బ్యాటరీ, సింగిల్ ఛార్జ్‌తో గరిష్ఠంగా మూడు గంటల స్క్రీన్ టైమ్ అందిస్తుంది. ఈ ఫెసిలిటీతో పవర్ ఔట్‌లెట్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా పార్క్, బీచ్, బ్యాక్‌యార్డ్ పార్టీలు లేదా క్యాంపింగ్ ట్రిప్‌కు టీవీని తీసుకెళ్లవచ్చు. స్టాండ్‌బైమీ గో టీవీ చిన్నగా ఉన్నా డాల్బీ విజన్, డాల్బీ అట్మోస్ వంటి అడ్వాన్స్డ్ ఫీచర్లను అందిస్తుంది. ఈ TV LG సొంత webOSతో రన్ అవుతుంది. ఈ OSలో నెట్‌ఫ్లిక్స్ , హులు, అమెజాన్ ప్రైమ్ వీడియోతో సహా పలు రకాల స్ట్రీమింగ్ యాప్‌లకు యాక్సెస్ పొందవచ్చు. కొత్త టీవీ యాపిల్ ఎయిర్‌ప్లే, బ్లూటూత్ పెయిరింగ్, Wi-Fiకి మద్దతు ఇస్తుంది. ఇది 1080p రిజల్యూషన్ LCD డిస్‌ప్లేతో వస్తుంది..
ఈ టీవీ ధర.. అమెరికాలో 999 డాలర్ల (దాదాపు రూ.83 వేలు) ధరతో ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉంది. ఆగస్టు నెలాఖరులో దీని డెలివరీలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇతర దేశాల్లో ఈ సూట్‌కేస్ టీవీ రిలీజ్ అయింది కానీ ఇండియాలో ఇంకా లాంచ్ కాలేదు. ఈ విషయంపై కంపెనీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ టీవీని ప్రీ-ఆర్డర్లు చేసే వారికి 299.99 డాలర్ల విలువైన LG XBOOM 360 అనే బ్లూటూత్ స్పీకర్ XO3QBE ఉచితంగా లభిస్తుంది.. ట్రావెల్-ఫ్రెండ్లీగా ఉంటుంది. స్ట్రీమింగ్, లిజనింగ్, రిమోట్ వర్కింగ్, మరిన్నింటి కోసం అనేక ఆప్షన్స్ ఆఫర్ చేస్తుంది.. ఇంకా ఎన్నో ఫెసిలిటీస్ ఉన్నాయి..