Leading News Portal in Telugu

Mukesh Ambani: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ముఖేష్ అంబానీ కొడుకు.. దేశ ప్రజలకు శుభవార్త


Mukesh Ambani: ఆకాష్ అంబానీ, ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ భారతదేశంలో 5G స్పెక్ట్రమ్‌ను రూ. 88,078 కోట్లకు ధృవీకరించింది. గతేడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దీన్ని ప్రకటించారు. 5జీ స్పెక్ట్రమ్ కోసం రెండో విడతగా రూ.7864 కోట్లను టెలికాం శాఖకు చెల్లించాల్సిన సమయం ఆసన్నమైంది. అయితే అంతకంటే ముందే ఆకాష్ అంబానీ ఓ శుభవార్త అందించారు. దేశంలోని అతిపెద్ద టెలికాం కంపెనీ రిలయన్స్ జియో 22 లైసెన్స్‌డ్ సర్వీస్ ఆసియా (ఎల్‌ఎస్‌ఎ)లో 5 జి నెట్‌వర్క్‌ను ప్రారంభించడాన్ని పూర్తి చేసినట్లు ప్రకటించింది. గత సంవత్సరం కొనుగోలు చేసిన స్పెక్ట్రమ్ కోసం కంపెనీ అన్ని స్పెక్ట్రమ్ బ్యాండ్‌లలో షెడ్యూల్ కంటే ముందే ఈ లాంచ్‌ను పూర్తి చేసింది.

Jio 700MHz, 800MHz, 1800MHz, 3300MHz, 26GHz బ్యాండ్‌లలో స్పెక్ట్రమ్‌తో అతిపెద్ద స్పెక్ట్రమ్ పరిధిని కలిగి ఉంది. దీనితో పాటు జియో కంపెనీకి చెందిన 5G నెట్‌వర్క్ చాలా వేగంగా ఉంది. Jio తన ప్రతి 22 సర్కిల్‌లలో మిల్లీమీటర్ వేవ్ బ్యాండ్ (26 GHz)లో 1,000 MHzని కలిగి ఉంది. ఇది అధిక నాణ్యతగల స్ట్రీమింగ్‌ను అందిస్తోంది. రిలయన్స్ జియో తన ప్రారంభానికి సంబంధించిన అన్ని వివరాలను గత నెలలో టెలికాం డిపార్ట్‌మెంట్ (DoT)కి సమర్పించింది. ఆగస్టు 11 నాటికి అన్ని సర్కిళ్లలో తన టెస్టింగ్ పనులను కూడా పూర్తి చేసింది.

ఆకాష్ అంబానీ ఏం చెప్పారు?
కేంద్ర ప్రభుత్వం, టెలికాం డిపార్ట్‌మెంట్, 1.4 బిలియన్ల భారతీయులకు తమ కంపెనీ నిబద్ధత ఎంటో అనేది నిరూపించ గల అధిక నాణ్యత గల 5G సేవలను ప్రారంభించామని రిలయన్స్ జియో ఛైర్మన్, ఆకాష్ అంబానీ తెలిపారు. 5G సేవల ప్రారంభ వేగానికి సంబంధించి ప్రపంచంలోనే భారతదేశాన్ని అగ్ర స్థానానికి తీసుకువెళ్లినట్లు చెప్పుతున్నందుకు గర్విస్తున్నామన్నారు. గతేడాది 5జీ స్పెక్ట్రమ్‌ వచ్చిన తర్వాత చాలా కష్టపడ్డామని అంబానీ చెప్పారు. ఈ ఏడాది చివరి నాటికి దేశవ్యాప్తంగా ఈ నెట్‌వర్క్‌ను ప్రారంభించేందుకు తమ బృందం ఒక ప్రణాళికను రూపొందించి.. దానిపై నిరంతరం కృషి చేస్తోందన్నారు.

ప్రస్తుతం రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్ మాత్రమే దేశవ్యాప్తంగా ఈ సౌకర్యాన్ని అందిస్తున్నాయి. ఈ కంపెనీలు 5G నెట్‌వర్క్ సౌకర్యాన్ని ప్రారంభించాయి. 5G నెట్‌వర్క్‌ను ప్రారంభించిన 10 నెలల్లో, ఇది మూడు లక్షలకు పైగా సైట్‌లలో ప్రారంభించబడింది. ప్రస్తుతం దేశంలోని దాదాపు 714 జిల్లాల్లో ఈ నెట్‌వర్క్ ప్రారంభమైంది.