Leading News Portal in Telugu

Alert: ఫోన్ కవర్‌లో కరెన్సీ నోట్లు పెడుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త మొబైల్ పేలిపోవచ్చు


Alert: సాధారణంగా చాలామందికి మొబైల్ పౌచ్ లేదా కవర్ వెనుక కరెన్సీ నోట్లు దాచి పెడుతుంటారు. అవే కాకుండా కొన్ని సార్లు ఏటీఎం కార్డులు, ఇతర మందపాటి పేపర్లు కూడా పెడుతుంటారు. కానీ అలా చేయడం వల్ల మీరు డేంజర్‌ జోన్‌లో ఉన్నట్లే …. అది మాత్రం ఎప్పటికీ మర్చిపోకండి. మీరు మీ ఫోన్ కవర్‌లో నోట్స్ లేదా ఏదైనా పేపర్‌ను కూడా ఉంచుకుంటే జాగ్రత్తగా ఉండండి. మీ మొబైల్ ఫోన్ పేలవచ్చు. నిజానికి గతంలో వచ్చిన రిపోర్టుల ప్రకారం మొబైల్ ఫోన్లు బ్లాస్ట్ అయ్యే ప్రమాదం ఉంది. యూజర్లు చేసే చిన్న చిన్న పొరపాట్లే ఇందుకు కారణమవుతున్నాయి. ఫోన్ కవర్‌లో నోట్స్ లేదా ఎలాంటి కాగితాలను సాధ్యమైనంత వరకు ఉండకుండా చూసుకోవాలి. ఫోన్‌లో కరెన్సీ నోట్లు ఉంచడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో.. దాని వల్ల ఎంత నష్టం వాటిల్లుతుందో తెలుసుకుందాం..

ఫోన్లు పేలడానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటిలో ఒకటి ఫోన్ కవర్‌లో కరెన్సీ నోట్స్ ఉంచడం. వాస్తవానికి, ఫోన్ వేడెక్కడం మీరు తరచుగా చూసి ఉంటారు. దీని వెనుక ఉన్న అతి పెద్ద కారణం ఫోన్‌లో కరెన్సీ నోట్లు ఉంచడం లేదా ఫోన్‌పై మందపాటి కవర్ కలిగి ఉండటం. మీరు ఫోన్‌ని నిరంతరం ఉపయోగించినప్పుడు ఫోన్ వేడెక్కుతుంది. ఫోన్ కవర్‌లో ఉంచిన డబ్బు లేదా కవర్ కారణంగా అది చల్లబరచడానికి స్థలం లభించదు. దీని కారణంగా ఫోన్ వేడెక్కుతుంది.. వెంటనే పేలిపోతుంది. వాస్తవానికి ఫోన్ కవర్ మందంగా ఉంటుంది. మీరు దానిలో డబ్బు ఉంచినట్లయితే అది వైర్‌లెస్ ఛార్జింగ్‌లో కూడా సమస్యలను కలిగిస్తుంది. ఫోన్ కవర్‌లో నోట్‌ను ఉంచుకోవడం కొన్నిసార్లు నెట్‌వర్క్ సమస్యలకు దారి తీస్తుంది. ఛార్జింగ్‌లో ఉన్నప్పుడు ఫోన్‌ని ఉపయోగించడం వల్ల కూడా ఫోన్ బ్లాస్ట్ అవుతుంది. మీరు ఫోన్ కవర్‌లో డబ్బును ఉంచినట్లయితే అది మీకు చాలా నష్టాలను కలిగిస్తుంది. మీ ఫోన్ పేలితే దానితో పాటు మీ ప్రాణం కూడా ప్రమాదంలో పడుతుంది.