Leading News Portal in Telugu

Redmi Note 11S Price: అమెజాన్‌లో టాప్ ఆఫర్.. రూ. 799కే రెడ్‌మీ నోట్‌ 11ఎస్‌ స్మార్ట్‌ఫోన్‌!


Purchase Redmi Note 11S Smartphone only Rs 799 in Amazon: పండగ సీజన్ మొదలైంది. ఈ నెల 30న ‘రక్షా బంధన్’ ఉంది. రక్షా బంధన్ తర్వాత చాలా పండుగలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లలో భారీ తగ్గింపులు ఇప్పటినుంచే ఆరంభం అయ్యాయి. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో కూడా ప్రస్తుతం భారీ తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. రెడ్‌మీ నోట్‌ 11ఎస్‌పై భారీగా తగ్గింపు అందుబాటులో ఉంది. రెడ్‌మీ నోట్ 11ఎస్‌పై ఎంత తగ్గింపు ఉంది, ఫోన్‌లో ఏయే ఫీచర్లు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Redmi Note 11S Offers:
రెడ్‌మీ నోట్‌ 11ఎస్‌ అసలు ధర రూ. 19,999గా ఉంది. అమెజాన్‌లో 35 శాతం తగ్గింపు తర్వాత.. ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ. 12,999కి కొనుగోలు చేయొచ్చు. అంటే మీరు ఈ ఫోన్‌పై 7 వేల రూపాయలు ఆదా చేసుకోవచ్చు. ఇది కాకుండా రెడ్‌మీ నోట్ 11ఎస్‌పై అనేక ఆఫర్లు ఉన్నాయి. దాంతో ఈ ఫోన్ ధర గణనీయంగా తగ్గుతుంది.

Redmi Note 11S Exchange Offer:
రెడ్‌మీ నోట్ 11ఎస్‌పై రూ. 12,200 ఎక్స్‌ఛేంజ్‌ఆఫర్ అందుబాటులో ఉంది. మీరు మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్‌ చేసుకుంటే.. మీకు ఇంత మొత్తం లభిస్తుంది. అయితే మీ పాత ఫోన్ కండిషన్ బాగుండి, మోడల్ లేటెస్ట్‌ది అయినప్పుడే ఈ ఫుల్ ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్ వర్తిస్తుంది. ఒకవేళ మీరు పూర్తి ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్ పొందితే.. రెడ్‌మీ నోట్ 11ఎస్‌ను కేవలం రూ. 799 సొంతం చేసుకోవచ్చు.

Redmi Note 11S Features:
రెడ్‌మీ నోట్ 11ఎస్‌ ఫోన్ 6.43 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ+ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. ఈ ఫోన్‌లో మీడియాటెక్ హీలియో G96 ప్రాసెసర్ ఉంది. ఇది గేమింగ్ మరియు లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 8MP అల్ట్రా-వైడ్, 2MP మాక్రో మరియు 4MP పోర్ట్రెయిట్ లెన్స్‌తో 108MP ప్రైమరీ కెమెరా ఉంటుంది. సెల్ఫీ మరియు వీడియో కాలింగ్ కోసం 16MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.