Leading News Portal in Telugu

Apple AirPods Pro: రూ. 1000 కే యాపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రో.. ఎక్కడో తెలుసా?


ప్రముఖ బ్రాండెడ్ కంపెనీ యాపిల్ ఎన్నో రకాల వస్తువులను తయారు చేస్తుంది.. వీటిలో ఐఫోన్స్‌తో పాటు ఎయిర్‌పాడ్స్‌కు మంచి డిమాండ్ ఉంది.. ఈమధ్య యూత్ ఎక్కువగా వీటిని వాడుతున్నారు.. అయితే పోర్ట్‌ఫోలియోను విస్తరణలో భాగంగా యాపిల్ ఇప్పటికే ఎయిర్‌పాడ్స్ ప్రో బడ్స్ రిలీజ్ చేసింది. ఈ టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్ అడ్వాన్స్‌డ్ ఫీచర్స్‌తో అత్యంత ప్రజాదరణ పొందాయి. త్వరలోనే యాపిల్ ఐఫోన్ 15 సిరీస్‌తో పాటు న్యూ ఎయిర్‌పాడ్స్ ప్రోను యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్ ఫీచర్‌తో లాంచ్ చేయనుంది. ఈ నేపథ్యంలో దిగ్గజ ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్, పాత తరం యాపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రోపై భారీ ఆఫర్ ను ప్రకటించింది..రూ .27వేల ప్రొడక్ట్‌ను ఇప్పుడు కేవలం వెయ్యి రూపాయలకే సొంతం చేసుకోవచ్చు.. ఆ ఆఫర్ పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఫీచర్స్ :

స్మాల్ స్టెమ్‌తో కూడిన సిలికాన్ టిప్స్‌తో డిజైన్ చేశారు. అందుకే వీటిని ఎక్కువ మంది యూజ్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇవి స్వెట్(చెమట), వాటర్ రెసిస్టెంట్‌ ప్రొడక్ట్. 2x వరకు మోర్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, ప్లస్ అడాప్టివ్ ట్రాన్స్‌ఫరెన్సీ, ఇమ్మర్సివ్ సౌండ్ కోసం డైనమిక్ హెడ్ ట్రాకింగ్‌తో పర్సనలైజ్డ్ స్పేషియల్ ఆడియో వంటి ఫీచర్స్ దీని ప్రత్యేకతలు. ఈ టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్ MagSafe ఛార్జింగ్ కేస్‌తో 24 గంటల కంటే ఎక్కువ లిజనింగ్ టైమ్‌ను అందిస్తుంది. ఇవి ట్రాన్స్‌ఫరెన్స్ మోడ్‌తో బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తాయి. మన చెవి ఆకారానికి తగ్గట్టు ఆటోమెటిక్‌గా మ్యూజిక్‌కు తగ్గట్లు మారతాయి..

ఈ ఆఫర్ వివరాలను చూస్తే.. యాపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రో రూ.26,900 ధరతో లాంచ్ అయిన సంగతి తెలిసిందే. అయితే వీటిపై ఫ్లిప్‌కార్ట్ భారీ ఆఫర్ ప్రకటించింది. ఏకంగా రూ.22,000 పైగా డిస్కౌంట్‌తో ఈ ఇయర్‌బడ్స్‌ను సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ఈ ఇయర్ బడ్స్‌పై రూ.3,910 ప్రారంభ డిస్కౌంట్ ప్రకటించింది. దీంతో వీటి ధర రూ.22,990కు తగ్గింది. అయితే ఈ ప్రొడక్ట్‌పై ఫ్లిప్‌కార్ట్ ఎక్ఛేంజ్ ఆఫర్ కూడా ప్రకటించింది. అంటే మీ దగ్గర పాత స్మార్ట్‌ఫోన్ ఉంటే, దాన్ని ఎక్చేంజ్ చేసుకుంటే ఎయిర్‌పాండ్స్ ప్రో పై అదనంగా రూ.21,900 డిస్కౌంట్ లభిస్తుంది.. అంటే చివరగా రూ.1090 లకే సొంతం చేసుకోవచ్చు.. ఇక ఆలస్యం ఎందుకు కొనిసెయ్యండి..