Apple iPhone 14 Amazon Offers Today: ‘ఐఫోన్’కు ప్రపంచవ్యాప్తంగా ఫాన్స్ ఉన్నారు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా.. ప్రతి ఒక్కరు తమ జేబులో ఐఫోన్ ఉండాలని కోరుకుంటారు. ఎందుకంటే.. ఎంత ప్రీమియం ఆండ్రాయిడ్ ఫోన్ వాడినా ఐఫోన్ ఉంటే ఆ కిక్కే వేరు. అందుకే కొత్త ఐఫోన్లతో పాటు పాత మోడల్లకు కూడా అదే రేంజ్లో క్రేజ్ ఉంటుంది. యాపిల్ కంపెనీ ఈ ఏడాది ‘ఐఫోన్ 15’ సిరీస్‌ను లాంచ్ చేయనుంది. వచ్చే నెలల్లో 15 సిరీస్ అందుబాటులోకి వస్తుంది. దాంతో గతేడాది రిలీజ్ అయిన ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో మరియు ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌లపై తగ్గింపును అందిస్తోంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఐఫోన్ కొనాలనుకునే వారికి ఈ-కామర్స్ దిగ్గజం ‘అమెజాన్’ గుడ్‌న్యూస్ చెప్పింది. ఐఫోన్ 14పై (Apple iPhone 14 128 GB) 15 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. ఐఫోన్ 14 వేరియంట్ అసలు ధర రూ. 79,900గా ఉంది. ఐఫోన్ 14పై అమెజాన్ 15 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. దీంతో ఈ స్మార్ట్‌ఫోన్ రూ. 67,999కి అందుబాటులో ఉంటుంది. అంటే మీరు రూ.11,910 తగ్గింపు ధరతో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ 14పై అమెజాన్ బ్యాంక్ ఆఫర్లను కూడా ఉంచింది.
ఐఫోన్ 14పై అమెజాన్ రూ. 61,000 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందిస్తోంది. మీ పాత ఐఫోన్ కండిషన్ బాగుండి.. ఎలాంటి డామేజ్ లేకుంటే మొత్తం ఎక్స్ఛేంజ్ పొందవచ్చు. మీ పాత స్మార్ట్‌ఫోన్ మోడల్, వర్కింగ్ కండిషన్‌పై ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఆధారపడి ఉంటుంది. ఈ ఆఫర్‌ను అమెజాన్ కొన్ని లొకేషన్లకే పరిమితం చేసింది. అందుకే మీరు పిన్ కోడ్ ఎంటర్ చేసి ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఆఫర్ వర్తిసుందో లేదో ముందే చెక్ చేసుకోవడం మంచిది. ఇక నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. రూ. 3265 నో కాస్ట్ ఈఎంఐతో ఐఫోన్ 14 కొనేసుకోవచ్చు.