Leading News Portal in Telugu

Oppo Find N3 Flip Price: ఆగష్టు 29న ఒప్పో ఫైండ్ ఎన్3 ఫ్లిప్ లాంచ్.. ధర, ఫీచర్స్ వివరాలు ఇవే!


Oppo Find N3 Flip Smartphone Launching on August 29: చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు ‘ఒప్పో’ నుంచి మరో ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్ రానుంది. అదే ‘ఒప్పో ఫైండ్ ఎన్3 ఫ్లిప్’. ఈ స్మార్ట్‌ఫోన్ ఆగష్టు 29న అధికారికంగా లాంచ్ కానుందని కంపెనీ గురువారం ప్రకటించింది. రాబోయే లాంచ్ ఈవెంట్‌లో ఒప్పో ఫైండ్ ఎన్2 ఫ్లిప్ అప్‌గ్రేడ్ వెర్షన్‌ను ఆవిష్కరించడానికి సిద్ధంగా ఉందట. ఇక ఆగష్టు 29న ఒప్పో వాచ్ 4 ప్రోని కూడా కంపెనీ లాంచ్ చేస్తుంది. అయితే ఈ రెండు ఆగస్టు 29న చైనాలో లాంచ్ అవ్వనున్నాయి. ఫైండ్ ఎన్3 ఫ్లిప్, వాచ్ 4 ప్రో ఇమేజెజ్‌ని కంపెనీ అధికారికంగా రిలీజ్ చేసింది.

ఒప్పో ఫైండ్ ఎన్3 ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్, ఒప్పో వాచ్ 4 ప్రోలు ఆగస్టు 29న చైనాలో మధ్యాహ్నం 2 గంటలకు లాంచ్ అవనున్నాయి. ఒప్పో ఫైండ్ ఎన్3 ఫ్లిప్ ఇమేజెస్ పరిశీలిస్తే.. తన పోటీదారుల కన్నా చిన్నవిగా కనిపిస్తున్నాయి. నిలువు కవర్ స్క్రీన్‌తో క్లామ్‌షెల్ ఫోల్డబుల్ ఫోన్‌ మాదిరి ఉంది. Motorola Razr 40 Ultra, Samsung Galaxy Z Flip 5, OnePlus ఫోన్‌లలో కనిపించే ట్రై-స్టేట్ అలర్ట్ స్లయిడర్‌ ఈ ఫోన్ ఎడమ వైపున ఉంటుంది. ఈ ఫోన్ వెనుక భాగంలో కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉన్నాయి. ఇది ట్రిపుల్ వెనుక కెమెరా సెటప్‌ను కలిగి ఉండనుంది. కెమెరా కోసం వృత్తాకార హౌసింగ్ హాసెల్‌బ్లాడ్ బ్రాండింగ్‌ను కూడా కలిగి ఉంది.

ఒప్పో ఫైండ్ ఎన్3 ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.8-అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 3.26-అంగుళాల కవర్ అమోలెడ్‌ స్క్రీన్ కూడా ఉంటుంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 9200 SoC Mali-G715 Immortalis MP11 GPUతో వస్తుంది. ఈ ఫోన్ గరిష్టంగా 16GB RAM మరియు 512GB స్టోరేజ్‌తో రానుంది. ఆండ్రాయిడ్ 13-ఆధారిత ColorOS 13.1పై రన్ అవుతుంది. OISతో 50MP SonyIMX 890 ప్రైమరీ లెన్స్, 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ మరియు 32MP టెలిఫోటో సెన్సార్ వెనక భాగంలో ఉంటాయి. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందువైపు 32MP కెమెరా ఉంటుంది. 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,300mAh బ్యాటరీతో వస్తుంది. అయితే ఈ ఫోన్ ధర తెలియరాలేదు.