Leading News Portal in Telugu

Moto G84 5G Launch : కొత్త మోటో G84 5G ఫోన్..ఫీచర్స్ లీక్..


ప్రముఖ మొబైల్ కంపెనీ మోటోరోలా ఎప్పటికప్పుడు కొత్త మొబైల్స్ ను మార్కెట్ లోకి విడుదల చేస్తుంది.. ఇప్పటికే విడుదలైన మొబైల్స్ కు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది.. త్వరలోనే మార్కెట్ లోకి మరో ఫోన్ ను లాంచ్ చెయ్యనుందని సమాచారం.. ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ తేదీని కూడా ప్రకటించింది. గత రెండు వారాలుగా, రాబోయే హ్యాండ్‌సెట్ గురించి లీక్‌లు ఆన్ లైన్ లో వినిపిస్తున్నాయి.. ఈ మోటో G84 ఫోన్ డిజైన్, ముఖ్యమైన ఫీచర్లపై అనేక నివేదికలు సూచించాయి. కెమెరా, SoC, స్టోరేజ్ వివరాలతో సహా హ్యాండ్‌సెట్ ముఖ్య స్పెసిఫికేషన్‌లను కంపెనీ వెల్లడించింది.. మోటారోలా అప్గరేట్ మొబైల్ త్వరలోనే లాంచ్ కానుంది..

ఇకపోతే ఈ ఫోన్ ఈ-కామర్స్ ఫ్లిప్‌కార్ట్ మైక్రోసైట్‌ ద్వారా సెప్టెంబర్ 1న భారత మార్కెట్లో లాంచ్ కానుంది. 6.55-అంగుళాల 10-బిట్ pOLED డిస్‌ప్లేను 120Hz రిఫ్రెష్ రేట్, స్థాయిని కలిగి ఉంటుందని కంపెనీ వెల్లడించింది. 1300 నిట్స్, హ్యాండ్‌సెట్ Qualcomm Snapdragon 695 SoC ద్వారా పవర్ అందిస్తుంది. 12GB RAM, 256GB ఆన్‌బోర్డ్ స్టోరేజీతో రానుంది. ఆండ్రాయిడ్ 13తో షిప్ కానుంది. ఈ ఫోన్ మార్ష్‌మెల్లో బ్లూ, మిడ్‌నైట్ బ్లూ, వివా మెజెంటా అనే కలర్ ఆప్షన్‌లలో కూడా లాంచ్ కానుంది..

ఇక ఫీచర్ల విషయానికి వస్తే.. ఈ హ్యాండ్‌సెట్ 50MP ప్రైమరీ రియర్ సెన్సార్‌తో పాటు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో పాటు సెకండరీ 8MP అల్ట్రా-వైడ్ సెన్సార్, 8MP డెప్త్ సెన్సార్, LED ఫ్లాష్ యూనిట్‌ను కలిగి ఉండనుందని తెలుస్తుంది.. ముందు కెమెరా సెన్సార్ డిస్‌ప్లే పైభాగంలో మధ్యకు హోల్-పంచ్ స్లాట్ లోపల ఉంటుంది. ఈ ఫోన్ డాల్బీ అట్మోస్, మోటో స్పేషియల్ సౌండ్ సపోర్ట్, స్టీరియో స్పీకర్లతో వస్తుంది.. ఇకపోతే బ్యాటరీ సామర్థ్యనికి ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీని ప్యాక్ చేయనుంది.. గతంలో విడుదలైన దానికి ఇది అప్డేట్ అయ్యి వస్తుంది.. మొత్తానికి ధర కూడా తక్కువే అని సమాచారం.. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి..