Leading News Portal in Telugu

Elon Musk: తన కొడుకు ఫోటో షేర్ చేసిన ఎలాన్ మస్క్.. లిటిల్ ఎక్స్ అంటూ కామెంట్


ఎలాన్ మస్క్ జెయిట్ ఎక్స్ అనే లోగో ముందు నిలబడి ఉన్న తన కొడుకు ఎక్స్.. ఏఈఏ-12 ఫోటోను షేర్ చేశాడు. ముద్దు లొలుకుతున్న ఎలాన్ మస్క్ కొడుకు ఫోటోనెట్టింట వైరల్ అవుతోంది. టెస్లా, స్పేస్ ఎక్స్ అధిపతి ఎలాన్ మస్క్ తన కొడుకు ఏఈఏ-12 తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు. ఎక్స్ పక్కన లిటిల్ ఎక్స్ అనే క్యాప్షన్ తో ఆయన ఈ ఫోటోను షేర్ చేసిన వీడియోకు 56 మిలియన్లకు పైగా వ్యూస్, 8 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. @elonmusk తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసిన ఫోటోలో లిటిల్ ఎక్స్ భారీ ఎక్స్ లోగో ముందు నిలబడి మోకాలి వరకూ ఉన్న ఖాకీ ప్యాంట్‌తో టీషర్టుతో క్యూట్ గా కనిపించాడు.

మాస్క్ కొడుకు కెమెరా వైపు చూస్తూ చిరునవ్వులు చిందిస్తున్న లిటిల్ ఎక్స్ ఫోటో అందిరినీ ఆకర్షించింది. ఏఈఏ-12.. 2020లో జన్మించాడు. గ్రిమ్స్ తో ఎలాన్ మస్క్‌కి ఇతను మొదటి సంతానం. చాలా మందికి మస్క్ కొడుకు పేరు ఏఈ ఏ-12 పై అనుమానాలు ఉంటాయి. అసలు ఈ పేరు అర్ధం ఏంటి? ఎలా పిలుస్తారు? అంటే గ్రిమ్స్ ఈ పేరుకి గతంలో వివరణ ఇచ్చినా చాలా మందికి సరిగ్గా అర్ధం కాలేదు. కొత్తగా బావుందని మాత్రం అందరూ కితాబు ఇచ్చారు. అయితే, ఎలాన్ మాస్క్ ఏది చేసిన వినూత్నంగా ఉంటుందని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.