Leading News Portal in Telugu

iPhone 15 Launch 2023: ఇట్స్ ఆఫీషియల్.. సెప్టెంబర్ 12న ఐఫోన్ 15 లాంచ్! ధర మాత్రం చుక్కలే


iPhone 15 Launch Event on September 12: ‘యాపిల్’ లవర్స్‌కు శుభవార్త. కొన్ని నెలల నిరీక్షణ తర్వాత ‘ఐఫోన్ 15’ లాంచ్ ఈవెంట్‌ను యాపిల్ కంపెనీ అధికారికంగా ప్రకటించింది. సెప్టెంబర్ 12న యాపిల్ వార్షిక ఈవెంట్ జరగనుంది. అమెరికాకు చెందిన యాపిల్ కంపెనీ తన ‘వండర్‌లస్ట్’ ఈవెంట్‌ను భారత కాలమానం ప్రకారం సెప్టెంబర్ 12న రాత్రి 10:30 గంటలకు నిర్వహించనుంది. తాజా ఐఫోన్‌లతో పాటు ఇతర ఉత్పత్తులను కూడా ఈ ఈవెంట్‌లో కంపెనీ విడుదల చేయనుంది.

సెప్టెంబర్ 12న జరిగే ఈవెంట్‌లో ఎప్పటిలానే ఐఫోన్ సిరీస్‌లో నాలుగు మోడల్స్ (ఐఫోన్ 15 సంబంధించి) విడుదల కానున్నాయి. ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ మోడల్స్‌ను యాపిల్ కంపెనీ లాంచ్ చేయనుంది. అంతేకాదు యాపిల్ వాచ్ సిరీస్ 9 (Apple Watch Series 9), యాపిల్ వాచ్ అల్ట్రా 2 (Apple Watch Ultra 2) స్మార్ట్‌వాచ్‌లను కూడా విడుదల చేయనున్నారు. వీటితో పాటు మరిన్ని ఉత్పత్తులను కూడా లాంచ్ ఈవెంట్‌లో యాపిల్ ప్రదర్శనచనుంది.

సెప్టెంబర్ 12న యాపిల్ పార్క్‌లో నిర్వహించనున్న ఈ ఈవెంట్ చూడాలనుకునే వారు apple.com, Apple TV యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడవచ్చు. ఐఫోన్ లవర్స్ ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. ఈ విషయం తెలిసిన ఐఫోన్ లవర్స్ ఫోన్ కొనేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐఫోన్ 15 యొక్క అన్ని మోడల్‌లు డైనమిక్ ఐలాండ్ నాచ్ డిజైన్‌, కర్వ్‌డ్‌ డిజైన్, USB టైప్ C ఛార్జింగ్ సపోర్ట్‌తో రావొచ్చు. ఐఫోన్ 15 ఫోన్స్ కెమెరా అప్‌గ్రేడ్‌లను కలిగి ఉంటాయి. దాంతో ఈ సిరీస్ మరింత ప్రియం కానుంది. పూర్తి వివరాలు త్వరలోనే తెలియరానున్నాయి.