WordPad: ఎన్నో కొత్త కొత్త సాఫ్ట్‌వేర్‌లు వచ్చినా.. కొన్ని పాతవాటికి ఎప్పటికీ ప్రాధాన్యత తగ్గదు.. అందులో వర్డ్‌ప్యాడ్ ఒకటి.. ఏది టైప్ చేయాలనుకున్నా.. మొదట వర్డ్‌ప్యాడ్ ఓపెన్ చేస్తుంటారు.. అయితే, త్వరలోనే ఆ వర్డ్‌ప్యాడ్ మాయం కాబోతోంది.. ‘వర్డ్‌ప్యాడ్’కు ముగింపు పలకబోతున్నట్టు మైక్రోసాఫ్ట్ సంచలన ప్రకటన చేసింది.. విండోస్ 95తో పరిచయమైన ‘వర్డ్‌ప్యాడ్’ గత 30 ఏళ్లుగా ఎంతో ఆదరణ పొందింది.. డాక్యుమెంట్ రైటింగ్‌లో విరివిగా వినియోగించే వర్డ్‌ప్యాడ్.. ఇక తెరమరుగుకాబోతోంది. అంటే.. ఇప్పటికే వినియోగంలో ఉన్న విండోస్ వెర్షన్లలో ‘వర్డ్‌ప్యాడ్’ అందుబాటులో ఉన్నా.. భవిష్యత్‌లో రాబోయే వర్షన్లలో వర్డ్‌ప్యాడ్ కనిపించదు.. అన్ని అప్‌డేట్ అయినట్టే.. వర్డ్‌ప్యాడ్ కూడా అప్‌డేట్ వెర్షన్ వస్తుందని అనుకుంటున్నారేమో.. అది కూడా రాబోదు. అయితే, దీని స్థానంలో ‘మైక్రోసాఫ్ట్ వర్డ్’ను ఉపయోగించుకోవాలని ఆ సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది.
కాగా, ఇటీవలే సరికొత్త ఆప్షన్లతో అప్‌గ్రేడ్ వెర్షన్ ‘నోట్‌ప్యాడ్’ను విడుదల చేసిన మైక్రోసాఫ్ట్.. ఇప్పుడు అసలు వర్డ్‌ప్యాడ్ ఉండదంటూ ప్రకటించింది యూజర్లకు షాక్ ఇచ్చింది. మైక్రోసాఫ్ట్ ఆటోసేవ్ మరియు ట్యాబ్ ఉపసంహరణ వంటి ఫీచర్లతో నోట్‌ప్యాడ్‌ను అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు ప్రకటించిన ఒక రోజు తర్వాత WordPad తొలగిస్తున్నట్టు పేర్కొంది. విండోస్ 11లోని విండోస్ నోట్‌ప్యాడ్ యాప్ 2018లో సంవత్సరాలలో మొదటిసారిగా నవీకరించబడింది మరియు ట్యాబ్‌లు జోడించారు. ఇక, గత నెల, iOS మరియు Android తర్వాత, మైక్రోసాఫ్ట్ ఇప్పుడు విండోస్ 11లో దాని డిజిటల్ అసిస్టెంట్ కోర్టానా యాప్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. విండోస్‌లో Cortana స్వతంత్ర యాప్‌గా నిలిపివేయబడినప్పటికీ, Teams Mobile, Microsoft Teams Display మరియు Microsoft Teamsలో Cortanaకి మద్దతు నిలిపివేయబడింది. మరోవైపు.. ఎక్స్‌ప్లోరర్ సెట్టింగ్‌ల సంఖ్యను తగ్గించే ప్రయత్నంలో మైక్రోసాఫ్ట్ ఫైల్ ఎక్స్‌ప్లోరర్‌లోని ఫోల్డర్ ఎంపికల క్రింద కొన్ని పాత సెట్టింగ్‌లను కూడా తీసివేసింది.