Leading News Portal in Telugu

Phone On Bed: ఫోన్ ను బెడ్ మీద పెట్టి పడుకుంటున్నారా? ఏమౌతుందో తెలిస్తే గుండె ఆగిపోతుంది..


ఉదయం లేచినప్పటి నుంచి పడుకొనే వరకు చేతిలో ఫోన్ ఉండాల్సిందే.. లేకుంటే చాలా మందికి నిద్ర కూడా రాదు.. అయితే ఫోన్ ను తల కింద, లేదా పక్కన పెట్టుకొని పడుకుంటే ఏం జరుగుతుంది.. అస్సలు నిపుణులు ఏం చెబుతున్నారో వివరంగా తెలుసుకుందాం…

చిన్నారుల నుంచి పెద్దల వరకూ అందరికీ ఇదే అలవాటు. ఇక సెల్‌ఫోన్‌ వినియోగానికి బానిసలవుతున్న చిన్నారులు అనేక మంది వాటికి దూరమైతే తట్టుకోలేక మానసిక రోగాల బారిన కూడా పడుతున్నారు. ఇక పెద్దలు రోజంతా సెల్‌ఫొన్ వాడింది చాలక రాత్రుళ్లు కూడా దాన్ని దిండు పక్కన లేదా దిండు కింద పెట్టుకుని నిద్రపోతున్నారు..ఇలా పెట్టుకొని నిద్రపోతే ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.. అవేంటో వింటే గుండె ఆగిపోతుంది..

రాత్రి పొద్దుపోయే వరకూ మొబైల్ చూస్తూ నిద్రలోకి జారుకుంటే అది మెదడుపై పెను ప్రభావం చూపిస్తుంది. నిద్రలో క్రమక్రమంగా నాణ్యతలేమి తగ్గి నిద్రలేమి బారిన పడాల్సి వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చివరకు అది వ్యక్తుల రోజువారి పనులకు కూడా ఆటంకంగా మారుతుందని, మానసిక సామర్థ్యం సన్నగిల్లి పనిలో తప్పులు ఎక్కువ జరుగుతాయని చెబుతున్నారు.. మనసు మొత్తం ఫోన్ మీదే ఉంటే కొన్ని సార్లు ప్రమాదాలు కూడా జరుగుతాయని నిపుణులు చెబుతున్నారు..

ఇక బెడ్ మీద తలదిండు కింద పెట్టుకొని నిద్రపోతే ఇక అంతే సంగతి..యాపిల్ సంస్థ తన కస్టమర్లకు జారీ చేసిన మార్గదర్శకాలే నిదర్శనం. యాపిల్ సూచనల ప్రకారం, ఫోన్లను దిండ్లు లేదా దుప్పట్లపై లేదా వాటి పక్కల అస్సలు పెట్టుకోకూడదు. గాలి వెలుతురు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనే వీటిని చార్జింగ్ చేయాలని యాపిల్ స్పష్టం చేసింది. నిద్ర ముంచుకొచ్చే సమయాల్లో పక్కనే ఫోన్ ఉంటే అందులోని వెలుతురుకు నిద్రాభంగం తప్పదని హెచ్చరిస్తున్నారు.. ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఫోన్ ను వీలైనంత దూరంలో ఉంచడం మంచిది.. ఇక ఈ మధ్య ఫోన్స్ పేలిపోతున్నాయి ఇది కూడా ఆలోచించండి..