Buy iPhone 14 Only RS 63999 on Flipkart: ‘యాపిల్’ కంపెనీ తన ఐఫోన్ 15 సిరీస్‌ను సెప్టెంబర్ 12న లాంచ్ చేయనుంది. సాధారణంగా కొత్త సిరీస్‌ను ప్రారంభించిన వెంటనే.. పాత మోడళ్ల ధరలు పడిపోతుంటాయి. అయితే ఈసారి ‘ఐఫోన్ 14’ ధర.. 15 సిరీస్ లాంచ్‌కు ముందే తగ్గింది. అయితే ఐఫోన్ 14 ధరను తగ్గించింది యాపిల్ కంపెనీ కాదు. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో 14 ధర తగ్గింది. ఐఫోన్ 14ని ఫ్లిప్‌కార్ట్‌లో చాలా చాలా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.
iPhone 14 Discount Offer:
ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం ‘మొబైల్స్ బొనాంజా సేల్’ నడుస్తోంది. సెప్టెంబర్ 3న ప్రారంభమైన ఈ సేల్.. 9 వరకు కొనసాగుతుంది. ఈ సేల్‌లో ఐఫోన్ 14ని తక్కువ ధరకే ఇంటికి తీసుకెళిపోవచ్చు. ఐఫోన్ 14 అసలు ధర రూ. 79,900గా ఉంది. అయితే ఫ్లిప్‌కార్ట్‌లో 14 శాతం డిస్కౌంట్ అనంతరం రూ. 67,999కి అందుబాటులో ఉంది. అంటే మీరు రూ. 11,901 డిస్కౌంట్ పొందుతారు. ఇది కాకుండా బ్యాంక్ ఆఫర్ ద్వారా ఈ ఫోన్ ధర మరింత తగ్గుతుంది.
iPhone 14 Bank Offer:
ఐఫోన్ 14ని కొనుగోలు చేయడానికి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉపయోగిస్తే.. మీకు రూ. 4,000 తగ్గింపు లభిస్తుంది. ఈ తగ్గింపు తర్వాత ఐఫోన్ 14 ధర రూ. 63,999గా ఉంటుంది. ఈ ధర కూడా మీకు భారంగా ఉంటే.. ఏమాత్రం చింతించాల్సిన అవసరం లేదు. ఐఫోన్ 14పై ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. ఎక్స్‌ఛేంజ్ ద్వారా ఈ ఫోన్ ధర గణనీయంగా పడిపోతుంది.
iPhone 14 Exchange Offer:
ఐఫోన్ 14పై రూ. 50 వేల ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది. మీరు మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసుకుంటే.. మీరు ఇంత మొత్తం పొందవచ్చు. అయితే మీ పాత ఫోన్ కండిషన్ బాగుండడంతో పాటు ఎలాంటి డామేజ్ లేకుండా, లేటెస్ట్ మోడల్ అయి ఉంటేనే రూ. 50 వేల ఫుల్ ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ వర్తిస్తుంది. మీకు పూర్తి ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ వర్తిస్తే.. ఐఫోన్ 14 రూ. 13,999కే మీ సొంతం అవుతుంది. మీ పాత స్మార్ట్‌ఫోన్‌కు ఎంత ఎక్స్‌ఛేంజ్ వస్తుందో ముందే తెలుసుకుంటే బెటర్.