ఐఫోన్ 15 మొబైల్స్ యాపిల్ సంస్థ తాజాగా మార్కెట్ లోకి విడుదల చేసిన సంగతి తెలిసిందే.. గతంలో వచ్చిన మొబైల్స్ కన్నా కూడా ఈ సిరీస్ ఫోన్స్ కు ప్రత్యేకమైన ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి.. అందులో ముఖ్యంగా నావిగేషన్ సిస్టమ్..ఆపిల్ వండర్‌లస్ట్ ఈవెంట్ 2023లో సరికొత్త ఐఫోన్ మోడల్స్ కంపెనీ ఆవిష్కరించింది. ఆపిల్ ప్రవేశపెట్టిన ఐఫోన్ మోడళ్లలో ఐఫోన్ 15 ప్రో మోడల్స్‌కు అత్యాధునిక టెక్నాలజీని అందిస్తోంది. ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లలో భారత సొంత శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్ NavIC సపోర్ట్ ను అందిస్తుంది..
గత ఏడాదిలో భారత ప్రభుత్వం విదేశీ GPS సిస్టమ్‌లను తొలగించి NavICని స్వీకరించమని అనేక స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లను కోరింది. నావిగేషన్ సిస్టమ్‌కు సపోర్టు ఇవ్వడానికి మొబైల్ కంపెనీలు కొన్ని హార్డ్‌వేర్ మార్పులు చేయవలసి ఉంటుందని పేర్కొన్నాయి. అయితే, ఈ నావిగేషన్ సిస్టమ్ అందించడం ద్వారా ఆయా స్మార్ట్‌ఫోన్‌లు మరింత ఖరీదైనదిగా మారుతాయని ప్రభుత్వ సంస్థలు తెలిపినట్లు ఈ రాయిటర్స్ నివేదిక పేర్కొంది.. ఇలాంటి నావిగెషన్ ఫీచర్ ను అందించడం ఇది మొదటిసారి..
ఇకపోతే ఐఫోన్ 15 ప్రో, ప్రో మ్యాక్స్‌లు గ్రేడ్ 5 టైటానియం బాడీని కలిగి ఉన్నాయి. తద్వారా ఐఫోన్ మరింత మన్నికైనదిగా ఉంటుంది. ఈ ఐఫోన్ 15 మోడల్ బరువు కూడా చాలా తేలికగా ఉంటుంది. ఈ ఫోన్‌లు 6.1 అంగుళాల, 6.7 అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లే, సన్నని బార్డర్లతో ఉన్నాయి. ముందు భాగంలో అదనపు ప్రొటెక్షన్ లేయర్ సిరామిక్ షీల్డ్ ఉంది. అదనంగా, iPhone 15 Pro, Pro Maxలో USB టైప్-C ఛార్జింగ్ పోర్ట్ కూడా అందిస్తుంది..
iPhone 15 Pro మొత్తం 4 స్టోరేజ్ వేరియంట్‌లలో 128GB, 256GB, 512GB, 1TB వరకు అందిస్తుంది. ఈ ఫోన్ బ్లాక్ టైటానియం, వైట్ టైటానియం, బ్లూ టైటానియం, నేచురల్ టైటానియం అనే 4 కలర్ ఆప్షన్‌లలో కూడా అందుబాటులో ఉంటుంది. 128GB వేరియంట్ ధర రూ.1,34,900 కాగా, 256GB వేరియంట్ ధర రూ.1,44,900, 512GB వేరియంట్ రూ. 1,64,900, 1TB వేరియంట్ ధర రూ. 1,84,900 నుంచి అందుబాటులో ఉంటాయి.. ఈ ఫోన్ లాంచ్ అయిన వెంటనే భారీ సేల్ అయినట్లు యాపిల్ సంస్థ వెల్లడించింది..