Leading News Portal in Telugu

iPhone 12 Price: డెడ్ చీప్‌గా ఐఫోన్.. రూ 17,399కే మీ సొంతం!


Purchase iPhone 12 only Rs 17399 in Flipkart: యాపిల్ ‘ఐఫోన్‌’కు ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్ ఉంటుంది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు తమ జేబులో ఐఫోన్‌ ఉండాలనుకుంటారు. ఇందుకు కారణం.. ఎంత ప్రీమియం ఆండ్రాయిడ్ ఫోన్ వాడినా ‘ఐఫోన్’ ఇచ్చే కిక్కే వేరు. అందుకే కొత్త ఐఫోన్లతో పాటు పాత మోడల్‌లకు మంచి క్రేజ్ ఉంటుంది. యాపిల్ కంపెనీ ‘ఐఫోన్‌ 15’ సిరీస్‌ను ఇటీవల లాంచ్ చేసింది. మరో 15-20 రోజుల్లో ఈ సిరీస్ అందుబాటులోకి వస్తుంది. ఈ నేపథ్యంలో ఐఫోన్‌ 12 డెడ్ చీప్‌గా అందుబాటులో ఉంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 20,000 లోపు యాపిల్ ఐఫోన్ కొనుగోలు చేసే సువర్ణావకాశం ఉంది. ఐఫోన్ 12 (APPLE iPhone 12 Blue 64 GB) అసలు ధర రూ. 59,900గా ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో 16 శాతం తగ్గింపు తర్వాత ఈ ఫోన్ రూ. 49,999కి అందుబాటులో ఉంటుంది. అంటే మీరు దాదాపుగా రూ. 10,000 ఆదా చేసుకోవచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే.. రూ. 2000 తగ్గింపు ఉంది. అప్పుడు ఐఫోన్ 12 రూ. 57,900కి అందుబాటులో ఉంటుంది.

ఐఫోన్ 12పై రూ. 30,600 ఎక్స్‌ఛేంజ్‌ తగ్గింపు ఉంది. పూర్తి ఎక్స్‌ఛేంజ్‌ వర్తిస్తే.. ఐఫోన్ 12ను మీరు రూ. 17,399కి ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు. అయితే పూర్తి ఎక్స్‌ఛేంజ్‌ కావాలంటే.. మీ పాత స్మార్ట్‌ఫోన్ మంచి కండిషన్ లో ఉండాలి. అంతేకాదు ఎలాంటి డామేజ్ కూడా ఉండకూడదు. ఇక ఐఫోన్ 15ని ఇటీవల ప్రారంభించిన యాపిల్.. ఐఫోన్ 12తో పాటు ఐఫోన్ 13 మినీ ఉత్పత్తిని నిలిపివేసింది. అంతేకాక తన అధికారక స్టోర్ నుంచి ఈ రెండు ఫోన్లను తొలగించింది.