Leading News Portal in Telugu

Vivo Y100 Price Drop: రెండోసారి తగ్గిన వివో స్మార్ట్‌ఫోన్‌ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందంటే?


Vivo Y100A and Vivo Y100 SmartPhones Price Cut in India Again: కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని చూస్తున్నారా?.. అయితే మీకు ఓ శుభవార్త. చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ ‘వివో’.. తన రెండు స్మార్ట్‌ఫోన్‌ల ధరలను భారతదేశంలో మరోసారి తగ్గించింది. వివో వై100, వివో వై100 ఏ స్మార్ట్‌ఫోన్ ధరను తగ్గించినట్లు వివో ఇండియా తన ఎక్స్‌లో పేర్కొంది. ‘ఇప్పుడు కొత్త ధరలలో స్టైలిష్ వివో వై100, వివో వై100 ఏ స్మార్ట్‌ఫోన్‌లను పొందండి. త్వరపడండి.. ఇప్పుడే వీటిని మీ సొంతం చేసుకోండి’ అని వివో ఇండియా ట్వీట్ చేసింది.

వివో వై100 స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ. 23,999గా ఉండగా.. వివో వై100ఏ ధర రూ. 25,999గా ఉంది. అయితే వివో కంపెనీ ఇప్పుడు మరోసారి ఈ స్మార్ట్‌ఫోన్స్ ధరను తగ్గించేసింది. దాంతో వివో వై100 ఫోన్ రూ. 21,990.. వివో వై100ఏ రూ. 23,999 నుంచి ప్రారంభం అవుతోంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లపై గత మేలో కంపెనీ రూ. 1,000 తగ్గించింది. ఇప్పుడు మళ్లీ ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లపై రూ. 2,000 తగ్గింపును ప్రకటించింది. దాంతో ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లపై రూ. 3,000 తగ్గింపు పొందవచ్చు.

వివో వై100, వివో వై100 ఏ స్మార్ట్‌ఫోన్‌లపై బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఐసీఐసీఐ, ఎస్‌బీఐ, ఐడీఎఫ్‌సీ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, యస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, బీఓబీ.. బ్యాంకుల క్రెడిట్ కార్డుల ద్వారా ఈ ఫోన్స్ కొంటే రూ. 2 వేల క్యాష్ బ్యాక్ లభిస్తుంది. తాజా తగ్గింపు, క్యాష్ బ్యాక్ ద్వారా మీరు రూ. 4,000 ఆదా చేసుకోవచ్చు. ఇక ఎంపిక చేసిన ఫైనాన్స్ భాగస్వాముల ద్వారా ఈ స్మార్ట్‌ఫోన్స్ కొంటే.. జీరో డౌన్ పేమెంట్ సర్వీసులు కూడా పొందొచ్చు.

వివో వై100, వివో వై100 ఏ ఫీచర్స్:
# 6.38 అమొలెడ్ డిస్‌ప్లే
# ఫన్‌టచ్ ఓఎస్ 13
# మీడియాటెక్ డిమెన్‌సిటీ 900 ప్రాసెసర్ (వివో వై100)
# క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్ ( వివో వై100 ఏ)
# 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు
# 64 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా
# 16 ఎంపీ సెల్పీ కెమెరా
# 4500 ఎంఏహెచ్ బ్యాటరీ (44 వాట్ ఫాస్ట్ చార్జింగ్)