iPhone 13 to cost less than Rs 40000 in Amazon Great Indian Festival: 2023 దసరా పండగ నేపథ్యంలో ఈ కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు సూపర్ సేల్‌లను ప్రకటించిన విషయం తెలిసిందే. ‘బిగ్ బిలియన్ డేస్ సేల్’ను ఫ్లిప్‌కార్ట్ ప్రకటించగా.. ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్’ను అమెజాన్ ప్రకటించింది. ఈ రెండు సేల్స్ అక్టోబర్ 8 నుంచి ఆరంభం కానున్నాయి. వెబ్‌సైట్‌లో తమ బ్లాక్‌బస్టర్ డీల్‌లకు సంబందించిన పోస్టర్స్ వచ్చేశాయి. అయితే ఐఫోన్ 13 బేస్ వేరియంట్ ఆల్-టైమ్ తక్కువ ధరలో లభిస్తుందని అమెజాన్ వెల్లడించింది. రూ. 40,000 కంటే తక్కువ ధరలో ఐఫోన్ 13 అందుబాటులో ఉంటుందట.
2021లో భారతదేశంలో ఐఫోన్ 13 ఫోన్ రూ. 79,900 ప్రారంభ ధరతో లాంచ్ అయింది. గత కొన్ని నెలలుగా ఈ స్మార్ట్‌ఫోన్ భారీ తగ్గింపును పొందింది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2023 సందర్భంగా ఐఫోన్ 13 రూ. 40,000 కంటే తక్కువ ధరకు అందుబాటులో ఉండనుంది. గత నెలలో ఐఫోన్ 15 లాంచ్ తర్వాత యాపిల్ కంపెనీ అధికారికంగా ఐఫోన్ 13 ధరను రూ. 59,900కి తగ్గించింది. ఐఫోన్ 13ని రూ. 40 వేల కంటే తక్కువకు పొందాలంటే.. ఎస్‌బీఐ బ్యాంక్ కార్డ్‌ని ఉపయోగించాలి. లేదా మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసి రూ. 39,999 కంటే తక్కువ ధరకు పొందవచ్చు.
మ్యాక్‌బుక్ ఎయిర్ ఎమ్1 ఇప్పుడు అమెజాన్‌లో తక్కువ ధరకే అందుబాటులో ఉంటుంది. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2023లో భాగంగా కేవలం రూ. 69,990కి అందుబాటులో ఉంది. ఇది భారతదేశంలో కొనుగోలు చేయగల అత్యంత సరసమైన యాపిల్ సిలికాన్-ఆధారిత మ్యాక్‌బుక్‌గా మారింది. మ్యాక్‌బుక్ ఎయిర్ ఎమ్1 బేస్ మోడల్ 8 GB RAM, 256 GB ఇంటర్నల్ స్టోరేజ్‌ని కలిగి ఉంటుంది. దీని అసలు ధర రూ. 92,900గా ఉంది. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2023లో ఐఫోన్ 13 మాత్రమే కాదు.. ఐఫోన్ 12, ఐఫోన్ 14 సిరీస్‌లపై భారీ తగ్గింపులు ఉన్నాయి.