Leading News Portal in Telugu

Google Pixel 8 Price: భారత మార్కెట్‌లోకి గూగుల్‌ పిక్సెల్‌ 8 స్మార్ట్‌ఫోన్స్.. ధర, ఫీచర్ల వివరాలు ఇవే!


Google Pixel 8 and Google Pixel 8 Pro Smartphones Launch, Price in India: గూగుల్‌ పిక్సెల్‌ 8 స్మార్ట్‌ఫోన్స్ (పిక్సెల్ 8 మరియు పిక్సెల్ 8 ప్రో) భారత మార్కెట్‌లో బుధవారం విడుదలయ్యాయి. పిక్సెల్‌ 5G ఫోన్‌లు కొత్త గూగుల్‌ ఫ్లాగ్‌షిప్ చిప్‌సెట్ మరియు మెరుగైన కెమెరాలతో వస్తాయి. అయితే పాత డిజైన్‌లోనే ఈ ఫాన్స్ ఉంటాయి. పిక్సెల్ ఫోన్‌లు చాలా ప్రీమియంతో పాటు ప్రత్యేకమైన డిజైన్‌ను కలిగి ఉంటాయన్న విషయం తెలిసిందే. ఈ రెండు ఫోన్స్ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయి. ప్రీ-ఆర్డర్ ఆరంభం అయ్యాయి.

Google Pixel 8 and Google Pixel 8 Pro Offers:
గూగుల్‌ పిక్సెల్ 8 మరియు గూగుల్‌ పిక్సెల్ 8 ప్రో స్మార్ట్‌ఫోన్స్ సేల్ ఆఫర్ల విషయానికొస్తే.. ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్ మరియు యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌లపై రూ. 8,000 తగ్గింపు ఆఫర్ ఉంది. ఇది స్టాండర్డ్ మోడల్‌ పిక్సెల్ 8కు వర్తిస్తుంది. పిక్సెల్ 8 ప్రో కొనుగోలుదారులు రూ. 9,000 తగ్గింపును పొందవచ్చు. పిక్సెల్ 8 ప్రారంభ ధర రూ. 75,999 కాగా.. పిక్సెల్ 8 ప్రో ధర రూ. 1,06,999గా ఉంది.

Google Pixel 8 Specs:
గూగుల్‌ పిక్సెల్ 8 స్మార్ట్‌ఫోన్ 6.2 అంగుళాల యాక్చువా డిస్‌ప్లే, ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. 50 ఎంపీ పీడీ వైడ్‌ ప్రైమరీ సెన్సర్‌, 12 ఎంపీ అల్ట్రావైడ్‌ కెమేరా, 10.5 ఎంపీ సెల్ఫీ కెమేరా ఇందులో ఉంటాయి. 4575 ఎంఏహెచ్‌ బ్యాటరీ, క్యూఐ వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ (18W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు) సపోర్ట్‌ వంటి ఫీచర్లు పిక్సెల్ 8లో ఉంటాయి.

Google Pixel 8 Pro Features:
పిక్సెల్ 8 ప్రోలో 6.7 ఇంచెస్ QHD+ 120Hz LTPO ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే 2,400నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. పైన గొరిల్లా గ్లాస్ విక్టస్ 2ని అందిస్తున్నారు. ఈ ఫోన్ ముందు భాగంలో 10.5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉండగా.. వెనుకవైపు మూడు కెమెరా సెన్సార్‌లను కలిగి ఉంటుంది. ఇందులో OISతో 50-మెగాపిక్సెల్ ఫేజ్-డిటెక్ట్ ఆటోఫోకస్ వైడ్ కెమెరా, 48-మెగాపిక్సెల్ క్వాడ్-పీడీ అల్ట్రావైడ్ సెన్సార్ మరియు 48-మెగాపిక్సెల్ క్వాడ్-పీడీ 5x జూమ్ కెమెరా ఉన్నాయి. 30W వైర్డు ఛార్జింగ్ మరియు 23W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5050 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఇందులో ఉంది. టైటాన్ సెక్యూరిటీ చిప్, టెంపరేచర్ మానిటరింగ్ సెన్సార్ మరియు అల్ట్రాసోనిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటాయి.