Leading News Portal in Telugu

Vivo Y78t: వివో నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్..సెల్ఫీ ప్రియులకు బెస్ట్ చాయిస్..


Vivo Y78t: వివో నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్..సెల్ఫీ ప్రియులకు బెస్ట్ చాయిస్..

పండుగ సీజన్ లో మార్కెట్ లో కొత్త ఫోన్ ల హవా నడుస్తుంది. పాత మొబైల్స్ పై ఆఫర్స్ ఉండటంతో పాటుగా కొత్త ఫోన్లు కూడా మార్కెట్ లోకి విడుదల అవుతుంటాయి.. తాజాగా ప్రముఖ కంపెనీ వివో నుంచి మరో బడ్జెట్ ఫోన్ మార్కెట్ లోకి విడుదలైంది..వివో వై78టీ పేరుతో ఈ ఫోన్‌ను చైనాలో లాంచ్‌ చేసింది. భారత మార్కెట్లోకి త్వరలోనే ఈ స్మార్ట్ ఫోన్‌ను తీసుకురానున్నారు. ధర విషయానికొస్తే.. ఈ స్మార్ట్ ఫోన్‌ 12 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర భారత ధర రూ. 17,000గా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

మూన్‌ షాడో బ్లాక్‌, స్నోవీ వైట్‌ కలర్‌లో ఈ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ స్మార్ట్ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.64 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు..,.ఈ ఫోన్ ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్‌ 6జెన్‌ 1ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను అందించారు.. ఇక సెల్ఫీ ప్రియులకు ఇది బెస్ట్ ఫోన్ అనే చెప్పాలి.. 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను ఇచ్చారు. ఇక ఈ ఫోన్‌లో 44 వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 6000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు..

ఇదిలా ఉండగా.. వివో వై77టీకి కొనసాగింపుగా తీసుకొచ్చారు. గత ఆగస్టులో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. ఈ స్మార్ట్ ఫోన్‌కు పెద్ద ఎత్తున ఆదరణ లభించింది. దీంతో వివో దీనికి కొనసాగింపుగా ఈ కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. వివో వై78టీ స్మార్ట్ ఫోన్‌ ప్రస్తుతం వివో అధికారిక వెబ్‌సైట్‌తో పాటు రిటైల్‌ స్టోర్స్‌లో అందుబాటులో ఉంది.. అయితే ఇండియన్ మార్కెట్ లోకి ఈ ఫోన్ ఎప్పుడు విడుదల అవుతుందో మాత్రం తెలియలేదు.. కానీ త్వరలోనే ఈ ఫోన్ మార్కెట్ లోకి విడుదల కానుంది..