
చైనాకు సంబందించిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ వివో ఎప్పటికప్పుడు అప్డేట్ ఫీచర్స్ తో కొత్త ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు..గత ఏడాది నవంబర్‌లో వివో ఫొటోగ్రఫీ-ఫోకస్డ్ ఫ్లాగ్‌షిప్ హ్యాండ్‌సెట్‌లుగా వివో X90 సిరీస్ ప్రవేశపెట్టింది.. ఇప్పుడు x100 సిరీస్ ఫోన్లను ప్రవేశ పెట్టబోతుంది.. ఈ ఫోన్ ఎప్పుడూ చేయనున్నారో ప్రకటించలేదు కానీ ఈ ఫోన్ ఫీచర్స్ ఆన్లైన్లో లీక్ అయ్యాయి.. ఆ ఫీచర్స్ ఏంటో ఒకసారి చూద్దాం..
Vivo X100 బ్యాక్ కెమెరా సెటప్‌లో సోని ప్రైమరీ సెన్సార్ ఉండవచ్చు. అయితే, వివో ప్రో మోడల్ 1-అంగుళాల Sony IMX989 ప్రైమరీ కెమెరా సెన్సార్‌తో వస్తుందని చెప్పవచ్చు. రెండు మోడల్‌లు రాబోయే డైమెన్సిటీ MediaTek 9300 చిప్, లేటెస్ట్ LPDDR5T RAM టెక్నాలజీతో రన్ అవుతాయని తెలుస్తుంది..
ఇక కెమెరా విషయానికొస్తే.. Ee వివో X100 బ్యాక్ కెమెరా సెటప్‌లో Sony IMX920 ప్రైమరీ సెన్సార్, అల్ట్రా-వైడ్ షాట్‌ల కోసం Samsung JN1 లెన్స్, 3x ఆప్టికల్ జూమ్‌తో కూడిన టెలిఫోటో కెమెరా ఉంటాయి. వివో X100 ప్రో, వివో X100 మాదిరిగా అల్ట్రా-వైడ్ లెన్స్, టెలిఫోటో కెమెరాను కలిగి ఉంటుంది. అయితే, 1-అంగుళాల సోనీ IMX989 కెమెరా సెన్సార్‌ను ప్రైమరీ స్నాపర్‌గా, 4.3x ఆప్టికల్ జూమ్‌తో టెలిఫోటో షూటర్‌ని కలిగి ఉంటుందని సమాచారం.. తక్కువ పవర్ డబుల్ డేటా రేట్ 5 టర్బో శక్తితో కూడిన స్మార్ట్‌ఫోన్‌గా వస్తుందని కంపెనీ పేర్కొంది… వివో x90 సిరీస్ కు అప్డేటెడ్ గా ఈ మొబైల్స్ రానున్నాయి.. ధర తో పాటు ఎప్పుడూ లాంచ్ అవుతుందన్న విషయం తెలియాల్సి ఉంది..