Leading News Portal in Telugu

Lava Blaze 2 5G Launch: లావా నుంచి కొత్త 5జీ ఫోన్‌ లాంచ్‌.. ధర 10 వేలు మాత్రమే!


Lava Blaze 2 5G Launch: లావా నుంచి కొత్త 5జీ ఫోన్‌ లాంచ్‌.. ధర 10 వేలు మాత్రమే!

Lava Blaze 2 5G Price, Battery and Specs in India: దేశీయ మొబైల్ కంపెనీ ‘లావా’ తాజాగా మరో స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఇదివరకు ‘లావా బ్లేజ్‌ 2’ పేరిట రిలీజ్ చేసిన 4జీ ఫోన్‌ను.. కొన్ని మార్పులతో 5జీ ఫోన్‌గా తీసుకొచ్చింది. గురువారం (నవంబర్ 2) లావా బ్లేజ్‌ 2 5జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ నవంబర్ 9 నుంచి లావా మొబైల్ ఆన్‌లైన్ స్టోర్, అమెజాన్ ఇండియా మరియు ఎంపిక చేసిన రిటైలర్‌లలో అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ ధర కేవలం రూ. 10 వేలు కావడం విశేషం. చైనా కంపెనీలకు పోటీగా బడ్జెట్‌ ధరలో లావా స్మార్ట్‌ఫోన్‌లను రిలీజ్‌ చేస్తున్న విషయం తెలిసిందే.

లావా బ్లేజ్‌ 2 5జీ ఫోన్ 6.56 ఇంచెస్ హెచ్‌డీ ప్లస్‌ ఐపీఎస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్ రేటుతో వస్తోంది. మీడియాటెక్‌ డైమెన్సిటి 6020 ప్రాసెసర్‌తో వస్తుంది. ఆండ్రాయిడ్‌ 13తో వస్తున్న ఈ ఫోన్‌లో క్లీన్‌ యూఐ ఉంటుంది. వెనుక వైపు 50 ఎంపీ కెమెరా, 0.8 ఎంపీ వీజీఏ కెమెరా ఇందులో ఉన్నాయి. సెల్ఫీల కోసం 8 ఎంపీ కెమెరా అందుబాటులో ఉంటుంది. వెనుక కెమెరాతో 2కె రిజల్యూషన్‌ వరకు వీడియోను రికార్డు చేయొచ్చు. కెమెరా చుట్టూ రింగ్‌ లైట్‌ వస్తోంది.

లావా బ్లేజ్‌ 2 5జీ ఫోన్ 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీతో వస్తుంది. 18W ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు ఇది సపోర్ట్‌ చేస్తుంది. వైఫై5, బ్లూటూత్‌ 5.0, 3.5mm జాక్‌తో ఈ ఫోన్‌ వస్తుంది. ఈ ఫోన్‌ 203 గ్రాముల బరువు ఉంది. సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ను ఇందులో ఇచ్చారు. ఈ ఫోన్‌ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. 4జీబీ+ 64జీబీ వేరియంట్‌ ధర రూ. 9,999 కాగా.. 6జీబీ +128జీబీ వేరియంట్‌ ధర రూ. 10,999గా ఉంది. బ్లాక్, బ్లూ మరియు లావెండర్ రంగులలో ఈ ఫోన్ వస్తుంది.