Leading News Portal in Telugu

ChatGPT New Feature: చాట్‌జీపీటీలో కొత్త ఫీచర్.. ఎలా ఉపయోగించాలంటే?



Chatgpt (2)

ప్రముఖ సంస్థ ఓపెన్ ఏఐ రూపొందించిన టెక్నాలజీ టూల్ చాట్‌జీపీటీ.. ఇటీవల కాలంలో ఈ పేరు ఎక్కువగా వినిపిస్తుంది.. ప్రముఖ కంపెనీలు సైతం ఈ కంపెనీతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి.. ఈమేరకు చాట్‌జీపీటీ యూజర్ల కోసం అదిరిపోయే ఫీచర్స్ ను అందిస్తున్నారు.. తాజాగా సరికొత్త ఫీచర్ ప్రవేశపెట్టింది. చాట్‌జీపీటీ యూజర్ల అందరి కోసం వాయిస్ ఫీచర్ తీసుకొచ్చింది.. ఆ ఫీచర్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం…

చాట్‌జీపీటీని వాడే యూజర్లు ఎవరైనా సరే కేవలం టెక్స్ట్ మాత్రమే కాకుండా వాయిస్ ఫీచర్ ద్వారా మాట్లాడేందుకు అనుమతినిస్తుంది. తద్వారా వాయిస్ ఇన్‌పుట్స్ అందించి అవసరమైన సమాచారాన్ని పొందవచ్చు. ఇప్పుడు, ఈ వాయిస్ ఫీచర్ రెండు విధాలుగా అందుబాటులో ఉంది. ఉచితంగా లేదా పేమెంట్ చేయడం ద్వారా వినియోగదారులందరికీ అందుబాటులోకి వస్తుంది..

ఈ ఫీచర్ ను ఎలా ఉపయోగించాలంటే?

వినియోగదారులు తమ ఫోన్‌లో యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. అనంతరం హెడ్‌ఫోన్‌ ఐకాన్ కోసం సెర్చ్ చేయాలి. ఈ ఐకాన్‌పై ట్యాప్ చేయడం ద్వారా వాయిస్ చాటింగ్ ఫీచర్ యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ టెక్స్ట్ టైప్ చేయడానికి బదులుగా వినియోగదారులు చాట్‌జీపీటీతో మాట్లాడేందుకు వీలు కల్పిస్తుంది. ఈ అప్‌డేట్ చాట్‌జీపీటీ అనుభవాన్ని గణనీయంగా మారుస్తుందని మాజీ ఓపెన్ఏఐ అధినేత వెల్లడించారు..

వారి ప్రాధాన్యతల ఆధారంగా ఎంచుకోవడానికి ఐదు విభిన్న వాయిస్‌లను అందిస్తుంది. ఈ వాయిస్‌లను రూపొందించడానికి ఓపెన్ఏఐ ప్రొఫెషనల్ వాయిస్ యాక్టర్స్‌తో కలిసి పనిచేసింది. అదనంగా, మాట్లాడే పదాలను చాట్‌జీపీటీ అర్థం చేసుకోగలిగే టెక్స్ట్‌గా మార్చడానికి కంపెనీ ప్రత్యేక విస్పర్ స్పీచ్ రికగ్నిషన్ సిస్టమ్‌ను ఉపయోగించింది.. ఈ ఫీచర్ అందరికీ అర్థమయ్యేలా సరికొత్తగా ఉంటుందని చెబుతున్నారు.. అందరికి సులభంగా కమ్యూనికేషన్‌ని అందించేలా విభిన్న అప్లికేషన్‌లలో యూజర్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపరచడం వంటివి పనుల్లో ఈ ఏఐ ముందుకు వెళ్తుంది..