
ప్రముఖ బ్రాండెడ్ కంపెనీ శాంసంగ్ గెలాక్సీ నుంచి మరో స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చెయ్యనున్నారు.. గెలాక్సీ ఎస్24 ఫోన్ మోడల్ వస్తోంది. అద్భుతమైన ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ ఎస్24 మోడల్ గ్లోబల్ మార్కెట్లోకి విడుదల కానుంది.. లాంచ్ కు ముందే ఈ ఫోన్ ఫీచర్స్ ఆన్లైన్లో లీక్ అయ్యాయి.. ఆ ఫోన్ ఫీచర్స్ అలాగే ధర గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఇకపోతే ఈ ఏడాది ఎస్ 23 పేరుతో రిలీజ్ చేసిన ఫోన్ అత్యంత ప్రజాదరణ పొందింది. అయితే కొత్త ఏడాది ఎస్ 24 రిలీజ్ చేస్తామని గతంలో ప్రకటించింది. ఎస్-24 మొదటి అన్‌ప్యాక్డ్ ఈవెంట్ సమీపిస్తున్న కొద్దీ గెలాక్సీ ఎస్ 24 లైనప్ గురించి పుకార్లు, లీక్‌లు కూడా వెలువడుతున్నాయి. దక్షిణ కొరియా టెక్ దిగ్గజం యొక్క తదుపరి అన్‌ప్యాక్డ్ ఈవెంట్ జనవరి 17న షెడ్యూల్ చేసింది. ఈ ఈవెంట్‌లో సామ్‌సంగ్ ఈ లైనప్‌లో మూడు మోడళ్లను పరిచయం చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.. అందులో గెలాక్సీ S24, S24+ S24 అల్ట్రా మోడల్స్ రిలీజ్ చేయనుంది..
ఈ ఫోన్ల ఫీచర్స్ విషయానికొస్తే.. 6.2 అంగుళాల ఎమోఎల్‌ఈడీ 2 ఎక్స్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేతో రానుంది. 50 ఎంపీ ప్రధాన కెమెరా, 8 జీబీ +128 జీబీ, 8 జీబీ + 256 జీబీ వేరియంట్‌లో ఈ ఫోన్ లాంచ్ అవకాశం ఉందని టెఖ్ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ 4,000 ఎంఏహెచ్ బ్యాటరీని ప్యాక్‌తో వస్తుంది. కేవలం 30 నిమిషాల్లో 50 శాతం గెలాక్సీ ఎస్ 24+ మోడల్ ఇదే కెమెరా సిస్టమ్‌తో వచ్చే అవకాశం ఉంది. అయితే ఎస్ 24 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లో పెద్ద 6.7-అంగుళాల ఎమోఎల్‌ఈడీ 2 ఎక్స్ క్యూహెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 4,900 ఎంఏహెచ్ బ్యాటరీని ఒక్కో ఫోన్ ఒక్కో అప్డేట్ వర్షన్ లో మార్కెట్ లోకి విడుదల కాబోతున్నాయి.. ఇక ఈ ఫోన్ల ధరల గురించి ఎక్కడా వెల్లడించలేదు..