
యాపిల్ ఐఫోన్ కు ఉన్న క్రేజె వేరు.. ఈ బ్రాండ్ లో ఏదైనా ఫోన్ తమతో ఉంటే బాగుండు అని యూత్ అనుకుంటారు.. ఈ మధ్య ఇదే ట్రెండ్.. అయితే ఐఫోన్ కొనాలని అనుకొనేవారికి ఇది మంచి సమయం.. న్యూయర్ కు మంచి ఆఫర్ ను యాపిల్ ప్రకటించింది.. ఐఫోన్ 15 ధరపై భారీ తగ్గింపు ను ప్రకటించింది.. కొన్ని బ్యాంక్ కార్డుల పై ఫోన్ ను కొనుగోలు చేస్తే మరింత తగ్గింపు ఆఫర్ ను పొందవచ్చు.. ఆ డిటైల్స్ ను ఇప్పుడు ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
సాధారణంగా ఐఫోన్ 15 ధర రూ. 79990. ఈ లేటెస్ట్ ఫోన్‌ను అమెజాన్‌లో కొనుగోలు చేసినట్లయితే రూ. 74990కే సొంతం చేసుకోవచ్చు. అంటే ఐఫోన్ 15 కొనుగోలుదారులు రూ.5000 డిస్కౌంట్ పొందవచ్చు.. ఇక అంతేకాదు.. కొన్ని కార్డులతో కొనుగోలు చేస్తే డిస్కౌంట్ ను కూడా పొందవచ్చు.. అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ కార్డు వినియోగదారులు 5 శాతం క్యాష్ బ్యాక్ కూడా పొందవచ్చు. దీంతో రూ.79990 మొబైల్.. అన్ని డిస్కౌంట్స్ తరువాత రూ.71245కే కొనుగోలు చేయవచ్చు. మొత్తం మీద ఐఫోన్ 15 కొనుగోలుపై ఇప్పుడు 8745 రూపాయల తగ్గింపును పొందవచ్చు..
ఈ ఫోన్ ఫీచర్స్ విషయానికొస్తే.. ఐఫోన్ 14 తో పోలిస్తే ఈ ఫోన్ అడ్వాన్స్ ఫీచర్స్ ను కలిగి ఉంది. 6.1 ఇంచెస్ స్క్రీన్ కలిగిన ఈ మొబైల్ అద్భుతమైన కెమెరా సెటప్ పొందుతుంది. దీంతో వినియోగదారులు 0.5x, 1x, 2x జూమ్ స్థాయిలలో కూడా ఫోటోలను తీసుకోవచ్చు. మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో లభించే ఈ మొబైల్ 128, 256, 512 జీబీ మెమొరీ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఇది ఇప్పుడు USB-C ఛార్జర్‌కు సపోర్ట్ చేస్తుంది. మొత్తం మీద ఐఫోన్ 15 అన్ని విధాలా అద్భుతంగా ఉంటుంది… ఐఫోన్ లవర్స్ కు ఇది సరైన సమయం మీరు కొనాలనుకుంటే ఇది మంచి సమయం.. త్వరపడండి..