Leading News Portal in Telugu

Breath Lock: ఫింగర్ ప్రింట్ లాక్, ఫేస్ లాక్ కాదు ఈసారి ఏకంగా బ్రీత్‌తో లాక్!


Breath Lock: ఫింగర్ ప్రింట్ లాక్, ఫేస్ లాక్ కాదు ఈసారి ఏకంగా బ్రీత్‌తో లాక్!

You Can Unlock Your Smartphone With Your Breath Soon: స్మార్ట్‌ ఫోన్‌లలో ఫేస్ అన్‌లాక్ అలాగే ఫింగర్ ప్రింట్ వంటి ఫీచర్లు వచ్చినప్పుడు, ఈ సెక్యూరిటీని బ్రేక్ చేసే అవకాశం లేదని అనుకున్నారు. కానీ కాలక్రమేణా అది కూడా బ్రేక్ చేసే పరిస్థితి ఏర్పడింది. కొందరు ఫోటోలు చూపిస్తూ ఫోన్‌ను అన్‌లాక్ చేస్తుండగా, మరి కొందరు నిద్రిస్తున్న కొంతమంది వేళ్లతో ఫోన్‌లను అన్‌లాక్ చేశారు. ఇప్పుడు ఈ భద్రతా వ్యవస్థలన్నీ అంత సేఫ్ కాదని తేలాయి. ఇక ఇప్పుడు కొత్త సెక్యూరిటీ ఫీచర్ ఒకటి తెర మీదకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. త్వరలో మీ ఊపిరితో ఫోన్‌ను అన్‌లాక్ చేయగలుగుతారని అంటున్నారు. అయితే వేలిముద్రల విషయంలో సాధ్యమైనట్లుగా, చనిపోయిన వ్యక్తి యొక్క ఫోన్‌ను అన్‌లాక్ చేయలేకపోవడం దీని వెనుక పెద్ద ప్రయోజనం.


Guntur Kaaram: గురూజీ కారణంగా గుంటూరు కారం సక్సెస్ సెలబ్రేషన్స్ క్యాన్సిల్.. ?

చెన్నైలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన మహేష్ పంచాగ్నుల అలాగే అతని టీం వారి ప్రయోగం తర్వాత ఇలా చేయచ్చని అనౌన్స్ చేశారు. వారు చెబుతున్న దాని ప్రకారం గాలి ఒత్తిడి సెన్సార్ నుండి సేకరించిన శ్వాసకి చెందిన డేటాతో ఈ ప్రయోగం చేశారట. ఈ డేటా సహాయంతో AI మోడల్‌ను రూపొందించడం మాత్రమే ఈ టీం లక్ష్యం. ఈ పరిశోధక బృందం ప్రకారం, వారి AI మోడల్ ఒకరి శ్వాస డేటాను విశ్లేషించిన తర్వాత, అది విశ్లేషించిన శ్వాస ఆ వ్యక్తికి చెందినదో కాదో 97 శాతం ఖచ్చితత్వంతో ధృవీకరించగలదని చెబుతున్నారు. ఈ AI మోడల్ శ్వాస సమయంలో ఒక వ్యక్తి యొక్క ముక్కు, నోరు మరియు గొంతు ద్వారా ఉత్పన్నమయ్యే వేవ్స్ నమూనాను బాగా గుర్తించగలదు. ప్రతి వ్యక్తి యొక్క శ్వాస వేవ్స్ భిన్నంగాఉంటాయట.