Leading News Portal in Telugu

Samsung Galaxy S24 Series : మార్కెట్ లోకి శాంసంగ్ గెలాక్సీ S24 సిరీస్..సూపర్ ఫీచర్లు, ధర ఎంతంటే?


Samsung Galaxy S24 Series : మార్కెట్ లోకి శాంసంగ్ గెలాక్సీ S24 సిరీస్..సూపర్ ఫీచర్లు, ధర ఎంతంటే?

ప్రముఖ మొబైల్ కంపెనీ శాంసంగ్ మార్కెట్ లోకి మరో కొత్త ఫోన్లను తీసుకురాబోతుంది.. శాంసంగ్ గెలాక్సీ ఎస్24 సిరీస్ భారత్ సహా ప్రపంచ మార్కెట్లలో లాంచ్ అయింది. కంపెనీ స్టాండర్డ్, ప్లస్, అల్ట్రా అనే మొత్తం మూడు మోడళ్లను మార్కెట్ లోకి లాంచ్ చేస్తుంది..ఒక్కో ఫోన్ కు ఫీచర్లను బట్టి ధర కూడా వేరేగా ఉంటుంది.. మూడింటిలో అత్యంత ప్రీమియం వేరియంట్ అల్ట్రా మోడల్ క్వాల్‌కామ్ సరికొత్త స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్‌ని ఉపయోగిస్తోంది. ఇతర మోడల్‌లు ఎక్సినోస్ ఎస్ఓసీని కలిగి ఉన్నాయి. కొత్తగా లాంచ్ అయిన శాంసంగ్ గెలాక్సీ ఎస్24 సిరీస్ ధర,ఫీచర్స్ ను ఒక్కసారి చూద్దాం..


ఫీచర్ల విషయానికోస్తే.. గెలాక్సీ ఎస్24 6.2-అంగుళాల ఫుల్-హెచ్‌డీ+ డైనమిక్ అమోల్డ్ స్క్రీన్‌ను 120హెచ్‌జెడ్ వరకు రిఫ్రెష్ రేట్‌తో కలిగి ఉంది. శాంసంగ్ ఇంటర్నల్ ఎక్సినోస్ 2400 చిప్‌సెట్ ద్వారా ఆధారితమైనది. 256జీబీ వరకు స్టోరేజీ ఆప్షన్ల ద్వారా సపోర్టు ఇస్తుంది.. అలాగే 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 12ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 30ఎక్స్ డిజిటల్ జూమ్‌తో 3ఎక్స్ ఆప్టికల్ జూమ్‌తో కూడిన 10ఎంపీ టెలిఫోటో సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్ ఉంది. చివరకు హుడ్ కింద పెద్ద 4,000ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది..

గెలాక్సీ ఎస్24+..6.7-అంగుళాల డైనమిక్ అమోల్డ్ డిస్‌ప్లేతో 1హెచ్‌జెడ్ నుంచి 120హెచ్‌జెడ్ వరకు రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఈ డివైజ్ ప్రామాణిక మోడల్ మాదిరిగా ఎక్సినోస్ 2400 చిప్‌సెట్‌ను ఉపయోగిస్తుంది. గరిష్టంగా 512జీబీ స్టోరేజీ ఆప్షన్లతో అందిస్తోంది.4,900ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది..

గెలాక్సీ ఎస్24 అల్ట్రా.. 6.8-అంగుళాల క్యూహెచ్‌డీ ప్లస్ డైనమిక్ అమోల్డ్ డిస్‌ప్లేను అందిస్తుంది. క్వాల్‌కామ్ కొత్త స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్ ద్వారా ఆధారితమైనది. 12జీబీ ర్యామ్‌తో గరిష్టంగా 1టీబీ స్టోరేజీ ఆప్షన్ల ద్వారా బ్యాకప్ పొందవచ్చు.. 200ఎంపీ ప్రైమరీ కెమెరాతో సహా క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఉంది. బ్యాక్ కెమెరా యూనిట్‌లో 12ఎంపీ అల్ట్రా-వైడ్ సెన్సార్, 5ఎక్స్ ఆప్టికల్ జూమ్‌తో 50ఎంపీ టెలిఫోటో కెమెరా, 3ఎక్స్ ఆప్టికల్ జూమ్ సపోర్ట్‌తో 10ఎంపీ టెలిఫోటో సెన్సార్ కూడా ఉన్నాయి.. ఇక హుడ్ కింద పెద్ద 5,000ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది..

ఇక చివరగా ఈ మూడింటి ధర విషయానికొస్తే.. శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ధర 799.99 డాలర్లు ( రూ. 66,538), అయితే గెలాక్సీ ఎస్24+ మోడల్ ధర 999.99 డాలర్లు ( రూ. 83,173). గెలాక్సీ ఎస్24 అల్ట్రా 1,299.99 డాలర్లు ( రూ. 1,08,125) వద్ద కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.. ఇక ఇండియాలో త్వరలోనే సేల్స్ ప్రారంభం కానున్నాయి..